BigTV English
Advertisement

Mahesh Babu : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేష్ బాబు.. ఏంటి జక్కన్న ఇది..!

Mahesh Babu : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేష్ బాబు.. ఏంటి జక్కన్న ఇది..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 రూపుదిద్దుకుంటుంది. రాజమౌళి సినిమా అంటేనే ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఆయన తీసిన ప్రతి చిత్రం  ప్రేక్షకుల మనసులో పదిలంగా ఉంటుంది. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తీసుకువెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇక సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు కారంమూవీ, తర్వాత మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా నిమిషాలలో వైరల్ అయిపోతుంది. తాజాగా ఈ సినిమా నుండి ఓ పిక్ బయటికి వచ్చింది. అది చూసిన అభిమానులు ఆనందంతో పాటు ఆశ్చర్యపోతున్నారు కూడ.. దానికి కారణం చూసేద్దాం..


కొత్త లుక్ ..సూపర్ ..

సూపర్ స్టార్ మహేష్ బాబు, గుంటూరు కారం మూవీ లో ఆయన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ని చూశాము. ఇప్పుడు మహేష్ రాజమౌళి చిత్రంలో ఏ విధంగా ఉండబోతున్నారో అని అభిమానులు ఎదురుచూస్తున్న టైంలో, తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది. మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో, రఫ్ గడ్డంతో, షార్ట్, టీషర్ట్ లో మూవీ టీం తో మాట్లాడుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటో చూసిన వారంతా అసలు మహేష్ బాబుయేనా .. లేదంటే వేరే ఎవరో నా గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు అని కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ రియల్ ఫ్యాన్స్ కూడా ఒక్కసారి ఆ ఫోటో చూసిన తర్వాత ఇతను మా హీరోయేనా అని జూమ్ చేసుకొని చూస్తున్నారు..జక్కన్న పూర్తిగా మహేష్ ను మార్చారు అంటూ .. మహేష్ నిజంగా కొత్త లుక్ లో సూపర్ గా ఉన్నారు అని  ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


చిత్ర షూటింగ్ లో ..

తాజాగా మహేష్ బాబు వెకేషన్ కంప్లీట్ చేసుకుని, రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. తాజాగా జరిగిన నాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను, రాజమౌళి షూటింగ్ నుంచి ఇక్కడికి వచ్చారు అంటూ నాని చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ప్రజెంట్ షూటింగ్ పనులలో మూవీ టీం బిజీగా ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు హనుమాన్ స్ఫూర్తితో కూడిన ఓ క్యారెక్టర్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా జరుగుతున్నా ఇటీవల ఒక వీడియో లీకైన సంగతి అందరికీ తెలిసిందే.. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజమౌళి RRR మూవీ తర్వాత ఈ సినిమా రావడంతో అభిమానుల లో భారీ అంచనాలే నెలకున్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎటువంటి సన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Nani :17 ఏళ్లు అయింది….ఇప్పటికీ అడుగుతున్నారు అని గుర్తు చేసుకున్న నాని వైఫ్

 

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×