BigTV English

Pakistan Poverty : పాకిస్తాన్‌కూ అదే గతి పడుతుందా? అఫ్గానిస్తాన్ పేద దేశంగా ఎలా మారిందో తెలుసా?

Pakistan Poverty : పాకిస్తాన్‌కూ అదే గతి పడుతుందా? అఫ్గానిస్తాన్ పేద దేశంగా ఎలా మారిందో తెలుసా?

Pakistan Poverty : పాకిస్తాన్‌ను ఏం చేయాలి? డైరెక్ట్‌గా యుద్ధం చేయాలా? మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరపాలా? పీవోకేను స్వాధీనం చేసుకోవాలా? బలూచిస్తాన్‌ వేర్పాటువాదానికి సపోర్ట్ చేయాలా? ఇలా ఇండియా ముందు అనేక ఆప్షన్స్ ఉండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తొలి నిర్ణయంగా సింధూ జలాల ఒప్పందానికే మొగ్గు చూపింది. అంటే, అదెంతటి కీలక నిర్ణయమో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒప్పందం నుంచి వైదొలిగితే.. పాకిస్తాన్ ఎడారిలా మారుతుంది.. పాకీలు గుక్కెడు నీటికోసం అల్లాడుతారు.. ఇలాంటి చాలానే విశ్లేషణలు జరుగుతున్నాయి. అందుకే, ప్రధాని మోదీ గురి చూసి పాకిస్తాన్‌ మీద పేదరికం అనే ఆయుధాన్ని సంధించారని అంటున్నారు.


మోదీ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఏం జరుగుతుంది? ఓ వంద మందిని లేపేయొచ్చు. మన ఇమేజ్ పెరగొచ్చు. గతంలో పీవోకేలో సర్జికల్ దాడులు చేశాం.. మళ్లీ ఉగ్రవాదులు పుట్టుకొచ్చారు.. ఇప్పుడిలా పహల్గాం దాడులకు తెగబడ్డారు. అంటే, సర్జికల్ స్ట్రైక్స్‌తో తాత్కాలిక ఊరట మాత్రమేనని తెలుస్తోంది. లేదంటే, డైరెక్ట్‌గా యుద్ధమే చేస్తే ఎట్టా ఉంటాది? అది సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే రెండూ అణ్వాయుధ దేశాలే. యుద్ధమంటూ జరిగితే ఇరువైపులా భారీ నష్టమే. పాకిస్తాన్ ఆల్రెడీ సర్వనాశనమైంది. యుద్ధంతో మనకే ఎక్కువ డ్యామేజ్. అందుకే, పాక్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనేది మోదీ స్కెచ్. పాకిస్తాన్‌ను పేద దేశంలా మార్చి.. అడుక్కుతినేలా చేస్తేనే కానీ.. ఉగ్రవాదాన్ని వదిలేసి.. బతుకు జీవుడా అని బుద్ధిగా ఉండదని భావిస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ పరిస్థితిని అఫ్గానిస్తాన్‌తో పోల్చుతున్నారు. భవిష్యత్తులో పాక్‌కు కూడా అఫ్గాన్‌కు పట్టిన గతే పడుతుందని అంచనా వేస్తున్నారు.


Also Read : ఆనాటి సర్జికల్ స్ట్రైక్.. ఎలా జరిగిందంటే..

అఫ్గానిస్తాన్‌లో ఏం జరిగిందంటే..

అఫ్గానిస్తాన్ ఒకప్పుడు వాణిజ్య కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచంలో అతి పేద దేశాల్లో ఒకటిగా మిగిలింది. దశాబ్దాల తరబడి యుద్ధాలు, దేశంలో అస్థిరత, విదేశీ జోక్యాలతో ఆ దేశం ఆగమాగమైంది. 1979లో అప్పటి సోవియట్ యూనియన్‌ (ఇప్పుటి రష్యా) తో అఫ్గాన్ యుద్ధం చేసింది. దాదాపు 10 ఏళ్ల పాటు యుద్ధం జరుగుతూనే ఉంది. లక్షల మంది చనిపోయారు. వేలాది గ్రామాలు నాశనమయ్యాయి. వ్యవసాయం కుప్పకూలింది. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. యుద్ధం ముగిశాక.. ఇక కోలుకుందాం అనుకుంటుండగా.. అఫ్గానిస్తాన్‌పై అమెరికా విరుచుకుపడింది. ఆల్‌ఖైదా అంతుచూస్తామంటూ.. తాలిబన్ల పనిపడతామంటూ.. అఫ్గాన్ అంతుచూసింది అగ్రరాజ్యం. 2021 వరకు యూఎస్ సైన్యం చెప్పుచేతల్లోనే మగ్గింది. ఇలా అమెరికా సైన్యాలు వెళ్లిపోగానే.. అలా తాలిబన్లు గన్నులతో ప్రత్యక్షమయ్యారు. దేశం మతోన్మాదుల ఉక్కు పిడికిలిలో ఇంకా నలిగిపోతోంది. అఫ్గాన్ పౌరులకు సరైన చదువు లేదు.. ఉపాధి లేదు.. అభివృద్ధి జాడే లేదు. కఠిక పేదరికం అనుభవిస్తోంది అఫ్గానిస్తాన్. ఆ దేశం చేసిన తప్పల్లా.. ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడమే. తాలిబన్లను, టెర్రిస్టులను పెంచిపోషించడమే. పాకిస్తాన్ సైతం అదే పని చేస్తోంది. అందుకే, పాక్‌ ఫ్యూచర్‌ను ఊహిస్తే.. మరో అఫ్గానిస్తాన్‌ కనిపిస్తోందని అంటున్నారు.

అఫ్గాన్ పేదరికానికి కారణం ఇదే..

సుమారు 2.2 కోట్ల మంది అఫ్గన్లు ఆకలితో అలమటిస్తున్నాయని లెక్కలు చెబుతున్నాయి. తాలిబన్ ప్రభుత్వం రైతులతో బలవంతంగా మత్తు పదార్థాలు పండిస్తోంది. ఓపియం పండిస్తూ.. ఆ డ్రగ్‌ను మాఫియాకు అమ్మేస్తూ.. అక్కడి ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటోంది. సాధారణ రైతులకు మాత్రం పేదరికమే మిగిలింది. అఫ్గానిస్తాన్‌లో మహిళలపై కఠిన నిబంధనలు విధించారు. చదువుకు దూరం చేశారు. వైద్యం అందుబాటులో లేదు. అఫ్గానిస్తాన్ దాదాపుగా విదేశీ ఆర్థిక సాయంపైనే బతికింది చాలాఏళ్లు. 2021లో అమెరికా ఆ దేశాన్ని వీడి వెళ్లిపోవడంతో ఆర్థిక సాయం ఆగిపోయింది. అఫ్గాన్ పతనమైంది. కాస్త అటూఇటూగా పాకిస్తాన్ సైతం విదేశీ సాయంపై భారీగా ఆధారపడింది.

అఫ్గాన్ మాదిరే పాకిస్తాన్..

పాక్ అప్పుల కుప్పగా తయారైంది. 2023లో అమెరికా నుండి 90,000 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది పాకిస్తాన్. ఆ అప్పుకు వడ్డీ కూడా కట్టలేక సతమతమవుతోంది ప్రస్తుతం. పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కేవలం రూ.5 బిలియన్లకు పడిపోయాయి. పాకిస్తాన్ ప్రధానంగా.. చైనా, సౌదీ అరేబియా, అమెరికాల ఆర్థిక సాయం మీద ఆధారపడి బతుకు ఈడుస్తోంది. అఫ్గానిస్తాన్‌లా పాక్‌కు కూడా విదేశీ సాయం ఆగితే.. ఆర్థిక సంక్షోభం పక్కా. ఆర్థిక పతనంతో పాటు రాజకీయ అస్థిరత పాకిస్తాన్‌ను పట్టి కుదిపేస్తోంది. అక్కడి ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో.. ఎప్పుడు ప్రధాని పదవి ఊడుతుందో.. అంతా సైన్యం చేతిలో ఉంటుంది. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం.. పాక్ సైన్యం చేతిలో కీలుబొమ్మ లాంటిది మాత్రమే.

Also Read : పీవోకే స్వాధీనం సాధ్యమేనా? సవాళ్లు ఇవే..

పాక్ బలి కావాల్సిందేనా?

అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల రాజ్యంగా మారితే.. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. పాక్‌ నుంచి స్వతంత్రం కోరుతున్న బలూచిస్తాన్ వేర్పాటువాదం ఆ కేటగిరిలోనిదే. పీవోకేను ఉగ్రవాదులకు కేరాఫ్‌గా మార్చేసి.. భారత్ మీదకు ఉసిగొల్పుతోంది పాపిస్తాన్. అఫ్గాన్ చేసినట్టే చేస్తే.. పాక్‌కు సైతం అదే గతి పడుతుందని అంటున్నారు. ఇప్పటికే ఆ దేశాన్ని భారీ వరదలు, ఎండలు పంటలను నాశనం చేస్తున్నాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడింది. ఇక, భారత్ సింధూ జలాల విషయంలో చెక్ పెడితే.. పాక్ పని గోవిందా. ఆ దేశాన్ని అల్లా కూడా కాపాడలేడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Also Read : పాక్‌పై యుద్ధానికి బలూచిస్తాన్ రెడీ.. ఇండియా కోసం వెయిటింగ్!

చైనాను నమ్ముకుంటే సరిపోద్దా?

అయితే, ఇంత అధ్వాన్నమైన దుస్థితిలో కూడా పాక్‌కు ఒకే ఒక ఆశాకిరణం చైనా. ఏం జరిగినా చైనా తమను కాపాడుతుందనే పిచ్చి నమ్మకంలో ఉందా దేశం. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ( CPEC ) పెట్టుబడులు చూసి డ్రాగన్ కంట్రీతో దోస్తానా సో బెటర్ అనుకుంటోంది. కానీ, ప్రస్తుతం చైనా పరిస్థితే అసలేం బాలేదు. కరోనా దెబ్బకు, ట్రంప్ ఆంక్షలకు.. దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చైనా ఉనికే ప్రశ్నార్థకంలో పడుతుంటే.. ఇక డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్‌కు ఏం సాయం చేస్తుంది? అంటున్నారు. జిత్తులమారి చైనాకు పాకిస్తాన్ మీద ఉండేది ప్రేమ కాదని.. అది కేవలం ఇండియాపై కోపంతోనే పాక్‌కు దగ్గరవుతోందనే లాజిక్‌ను గుర్తు చేస్తున్నారు.

పాక్‌కూ అదే గతి పడుతుందా?

ఇండియా, పాకిస్తాన్. పొరుగునే ఉండే ఈ రెండు దేశాల్లో ఎంత తేడా ఉంది. మనమేమో విద్య, ఉపాధి, పరిశ్రమలు, సాంకేతిక రంగం, ఆర్థిక వ్యవస్థలపై ఫోకస్ పెడితే.. పాక్ మాత్రం ఉగ్రవాదం వెంట పరుగెడుతూ సర్వనాశనం అవుతోంది. సైనిక బలం విషయంలో ఇండియాతో పోటీపడుతూ.. బడ్జెట్‌లో అధిక భాగం అందుకే ఖర్చు చేస్తోంది. పులి లాంటి భారత్‌ను చూసి వాతలు పెట్టుకుంటోంది నక్కజిత్తుల పాకిస్తాన్. అందుకు ఫలితం అనుభవించే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు. అఫ్గానిస్తాన్‌కు పట్టిన గతే పాకిస్తాన్‌కూ పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇన్‌ఫ్రంట్‌ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్. లెట్స్ సీ. నో డౌట్స్?

Also Read : ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. ఎవరి బలం ఎంత?

Also Read : రంగంలోకి అజీత్ దోవల్.. ఉగ్రవాదులకు నరకమే..

Also Read : భారత్‌కు కశ్మీర్ ఎంత కీలకమో తెలుసా?

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×