BigTV English
Advertisement

Nani :17 ఏళ్లు అయింది….ఇప్పటికీ అడుగుతున్నారు అని గుర్తు చేసుకున్న నాని వైఫ్

Nani :17 ఏళ్లు అయింది….ఇప్పటికీ  అడుగుతున్నారు అని గుర్తు చేసుకున్న నాని వైఫ్

Nani: నాచురల్ స్టార్ నాని సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంటాయి. నాని మొదటి సినిమా అష్టాచమ్మా కామెడీ ఎంటర్టైనర్ గా మన ముందుకు వచ్చింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, భార్గవి, తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ రిలీజ్ అయి 17 సంవత్సరాల అవుతున్నా, ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడే వారు, గుర్తు చేసుకునే వారు ఉన్నారు. తాజాగా ఈ సినిమా గురించి నాని సతీమణి అంజన గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ని నాని రీ పోస్ట్ చేశారు.. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఆ సినిమా వచ్చి అన్నేళ్లు అయిందా ..

అష్టా చమ్మా విడుదలై 17 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ నాని అభిమానులకు గుర్తుండిపోయే సినిమా. తాజాగా ఈ సినిమా గురించి నాని భార్య అంజన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సినిమా టైటిల్ తో వచ్చిన ఓ కార్టూన్ ను చూపిస్తూ, హీరో నానిని ట్యాగ్ చేశారు. 17 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ అడుతున్నారు. అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులంతా ఎప్పటికీ ఈ సినిమా మాకు గుర్తుంటుంది అంటూ.. రాంబాబు గా నానిని, ఆ సినిమాలో ఆయన చేసిన అల్లరిని మర్చిపోలేమని కామెంట్స్ చేస్తున్నారు.


కధ విషయానికి వస్తే ..

నాచురల్ స్టార్ నాని తెలుగు తెరకు పరిచయమైన సినిమా అష్టాచమ్మా. ఈ సినిమా కథ రాంబాబు, లావణ్య చుట్టూ తిరుగుతుంది. రాంబాబు గా నాని, లావణ్య గా స్వాతి నటించారు. ఈ సినిమాలో రాంబాబు ఒక సాధారణ యువకుడు. ఈ సినిమాలో తన పేరు మహేష్ అని చెప్పి లావణ్యని ప్రేమిస్తాడు. లావణ్య కి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అవసరాల శ్రీనివాస్ ఆనంద్, రాంబాబు చెల్లెలు వరలక్ష్మి నీ ఇష్టపడతాడు. తనను మహేష్ గా పరిచయం చేసుకుంటాడు. మరోవైపు రాంబాబు తన పేరు మహేష్ అని చెప్పడం.. ఇంకోవైపు ఆనంద్ మహేష్ అని చెప్పడం ఇలా పేర్లు మార్పులు జరిగి కథ మొత్తం కామెడీతో నిండిపోతుంది. చివరకు అన్ని గందరగోళాలు తీరి, ఎవరి పేర్లు వారు బయటపెట్టి, వారి ప్రేమను నిరూపించుకుంటారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు కామెడీ జానర్ లోనే నడుస్తుంది.

వారికి ఇది మొదటి సినిమా ..

ఈ సినిమాతో స్వాతి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమా అయినా నాని నటనకు ప్రశంసలు అందుకున్నాడు. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్మోహన్ నిర్మించారు. కళ్యాణ్ కోడూరు ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో ప్రతి పాట సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచింది. ఈ సినిమాలో ఝాన్సీ హీరోయిన్ కు పిన్నిగా అద్భుతమైన నటన కనబరిచింది.

ఇక అష్టా చమ్మా సినిమా కామెడీ సినిమాలలో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుంది. కథ, నటన టైమింగ్ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమాకు మొదట హీరోయిన్ గా భూమిక తీసుకుందామని అనుకున్నారు కానీ, ఆమెకు కుదరకపోవడంతో స్వాతిని తీసుకున్నారు. హీరో క్యారెక్టర్ కూడా ముందుగా గోపీచంద్, ఉదయ్ కిరణ్ ను సంప్రదించారు. అనుకోని కారణాల వల్ల వాళ్ళు అంగీకరించకపోవడంతో.. సినిమాలో కొత్త హీరోని ట్రై చేద్దామని నానిని తీసుకున్నారు. ఈ సినిమా ఫిలింఫేర్, నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ స్వాతి చెప్పే డైలాగ్ ఇప్పటికీ మహేష్ అభిమానులకు గుర్తుంటుంది. ‘మహేష్ ఆ పేరులోనే ఓ మత్తు ఉంది’.. ఈ డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

https://www.instagram.com/stories/anjuyelavarthy/3620603319691270953?utm_source=ig_story_item_share&igsh=MWkwOTN3ejNqbXhkdA==

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×