SSMB -29:సూపర్ స్టార్ మహేష్ బాబు ,(Maheshbabu), దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, రాజమౌళి, మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్తారా..?ఎప్పుడెప్పుడు సినిమాని రిలీజ్ చేస్తారా? అని తెగ ఆసక్తి కనబర్చుతున్నారు. ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం చాలా ప్రదేశాలు తిరిగి అక్కడి విశేషాలు తెలుసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోయే సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో ఉంటుంది అని తెలుస్తోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ సినిమా ఈరోజు అనగా జనవరి 2న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ లాంచింగ్ ఈవెంట్ కి మహేష్ బాబు రావడం లేదని తెలుస్తోంది.
ఘనంగా పూజా కార్యక్రమాలు..
ఎందుకంటే మహేష్ బాబు తాను నటించే సినిమాలకు ఎక్కువ శాతం పూజా కార్యక్రమాల్లో హాజరుకారు. అది ఆయన సెంటిమెంట్ కావచ్చు. ఇక రాజమౌళి మాత్రమే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేస్తున్నాడు. కాబట్టి ఎక్కువ హడావిడి చేయట్లేదని తెలుస్తోంది. అయితే రాజమౌళి తన ప్రతి సినిమాకి ముందు ప్రెస్ మీట్ పెట్టి దర్శకత్వం చేయబోయే సినిమాకు సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకుంటాడు. అలాగే మహేష్ బాబు సినిమాకి సంబంధించిన విశేషాలను కూడా ప్రెస్ మీట్ ద్వారా బయట పెడతారని తెలుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే, రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకి దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రెండు పార్ట్ లుగా విడుదలవబోతున్నట్టు ఇప్పటికే పలు వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ భారీ బడ్జెట్ వేయి కోట్ల సినిమాలో రాజమౌళి, మహేష్ బాబుల వాటా ఎంతో తెలుసా అంటూ ఓ వార్త నెట్టింట వినిపిస్తోంది. అయితే మహేష్ బాబు రాజమౌళిలు తాము చేసే సినిమాలలో రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా వాటానే తీసుకుంటారు. అలా ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా రెమ్యూనరేషన్ కాకుండా వాటా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా విడుదలయ్యాక దాదాపు 40 శాతం వాటా రాజమౌళి,మహేష్ బాబులు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయం తెలిసి సినిమా ఇంకా పట్టాలెక్కనే లేదు అప్పుడే వాటాల గోల మొదలైందా? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు
.
తెర వెనుక ఏం జరగబోతోంది..?
ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రాజమౌళి ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలి అని ఆలోచన చేస్తున్నారట. ఇందుకోసం ఆయన అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సోనీ, డిస్నీ వంటి సంస్థలతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి నిజంగానే ఈ సినిమాని తీసుకురాబోతున్నారా..? తెర వెనక నిజంగానే అంతర్జాతీయ ఒప్పందాలు జరుగుతున్నాయా..? రాజమౌళి ఏం మ్యాజిక్ చేయబోతున్నారు.. ? మహేష్ బాబు పాత్ర ఈ సినిమాలో ఏ విధంగా ఉంటుంది? అంటూ ఎన్నో ప్రశ్నలు అభిమానుల నుండి వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.