Elderly Woman Cybercrime| అమెరికాలో నివసిస్తున్న తన కూతురి కోసం తిండి పదార్థాలు కొరియర్ ద్వారా పంపించిన ఓ 78 ఏళ్ల మహిళ రూ.1.5 కోట్ల కోల్పోయింది. ఆమెను సైబర్ మోసగాళ్లు ఆ కిరియర్ ద్వారానే దోపిడీ చేశారు. తాను మోసపోయానని లేటుగా గ్రహించిన ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
పోలీసులు కథనం ప్రకారం.. ఢిల్లీలో నివసిస్తున్న లలితా శర్మ (78, పేరు మార్చబడినది) అనే మహిళ కూతురు అమెరికాలోనే స్థిరపడింది. ముంబై నగరానికి చెందిన లలిత శర్మ్ ఒక పెద్ద ధనవంతుడైన బిల్డర్ కు బంధువు కూడా. ఈ క్రమంలో లలితా శర్మ కొన్ని రోజుల క్రితం తన కూతురు కోసం తినుబండారాలు ప్యాక్ చేసి అమెరికాకు కొరియర్ చేసింది. అయితే మరుసటి రోజే ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వారు తాము క్రైమ్ బ్రాచ్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు.
లలిత శర్మ్ అమెరికాకు పంపిన కొరియర్ లో తినుబండారాలు కాకుండా ఆధార్ కార్డు, ఎక్స్‌పైర్ అయిన పాస్ట పోర్టులు, క్రెడిట్ కార్డులు, చట్ట వ్యతిరేక డ్రగ్స్, 2000 అమెరికన్ డాలర్లు క్యాష్ ఉన్నాయని చెప్పారు. ఇదంతా విని లలిత శర్మ షాక్‌కు గురైంది. ఫోన్ చేసిన వారు ఆమెపై వివిధ భారత చట్టాల కింద కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు.
ఆ తరువాత వారు వీడియో కాల్ ద్వారా విచారణ జరగుతుందని చెప్పి.. పోలీస్ యూనిఫామ్ ధరించి వీడియో కాల్ చేశారు. లలిత శర్మకు ఫేక్ వారెంట్స్ చూపించారు. ఈ విచారణ సమయంలో ఇతరులు ఎవరినీ కాల్ చేయకూడదని.. ఆమె ఫోన్ కాల్స్ ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. ఆ తరువాత మరికొందరు తాము ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులమని చెప్పి నమ్మించారు. వారంతా సూటు, బూటు వేసుకొని అధికారులుగా కనిపించే సరికి లలిత శర్మ వారిని నమ్మేసింది.
Also Read: ప్రియురాలి పగ.. పథకం వేసి ప్రియుడి ఆ భాగం కోసేసిన యువతి..
లలిత శర్మపై మనీ లాండరింగ్, డ్రగ్స్ రవాణా కేసులో నమోదు చేశామని చెప్పి నాలుగు రోజుల పాటు ఆమెను తన ఇంట్లోనే వీడియో కాల్స్ చేస్తూ బెదిరించారు. అయితే తాను ఏ నేరం చేయలేదని వాదించిన లలిత శర్మ విచారణకు వారితో సహకరిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ నకలీ పోలీసులు, అధికారులు ఆమె బ్యాంక్ అకౌంట్ వివరాలను అడిగారు. లలిత శర్మ వారి మాటలను నమ్మేసి ఆ వివరాలను ఇచ్చేసింది. అంతే లలిత శర్మ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మొత్తం రూ.1.51 కోట్ల డబ్బుని ఆ నకిటీ అధికారులు వేర్వేరు 15 బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసేశారు. ఆ తరువాత తాపీగా లలిత శర్మను త్వరలోనే ఆమె ఇంటికి వచ్చి విచారణ చేస్తామని నమ్మించి కాల్ కట్ చేశారు.
మరుసటిరోజు లలిత శర్మ ఇంటికి ఆమె బంధువులు రాగా.. ఆమె తనకు ఎదురైన పరిస్థితులను వివరించింది. దీంతో వారంతా ఇదంతా మోసమని చెప్పారు. లలిత శర్మను తీసుకొని ఢిల్లీ సైబర్ పోలీసులు వద్ద ఫిర్యాదు చేశారు. అయితే ఆమె డబ్బులు ఇంత వరకూ తిరిగి రాలేదు. ఇలాంటి మోసపూరితమైన కాల్స్ వస్తే.. భయపడ కుండా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.