SSMB 29:దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB -29). భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా.. గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీ రోల్ పోషిస్తున్నారు. అంతేకాదు మళయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో ఇండోర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఒడిస్సాలో అవుట్ డోర్ షూటింగ్ జరుపుకుంటుంది. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమా కోసం ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా ఎక్కడో ఒకచోట, ఏదో ఒక సన్నివేశం సోషల్ మీడియాలో లీక్ అవడంతో రాజమౌళి చిత్ర బృందం తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా సెట్లో మొబైల్ వాడకూడదని, సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం లీక్ కాకూడదని చిత్ర యూనిట్ తో రాజమౌళి అగ్రిమెంట్ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అగ్రిమెంట్ ను కూడా కాదని వీడియోలు లీక్ అవడంపై రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తూ.. చిత్ర బృందం పై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎస్ఎస్ఎంబి – 29 మూవీ స్టోరీ లీక్..
మొన్నటికి మొన్న మహేష్ బాబుకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇప్పుడు స్టోరీ ఇదే అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. మరి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంతో పాటు రామాయణంలోని కొన్ని ఘట్టాలను జోడిస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బాలీవుడ్ పోర్టల్ ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఈ విషయంపైనే పంచుకుంది. “ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుంది. పురాణాలకు, నేటి కాలానికి ముడి పెడుతూ సినిమా సాగుతుంది. దీనికోసమే చిత్ర బృందం హైదరాబాదులో కాశీ సెట్ వేశారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి.”. అంటూ ఆ పోర్టల్ ముద్రించగా.. అలాగే మహాభారతంతో కూడా కాస్త ముడి పడినట్లు తెలుస్తోంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మహాభారతం, రామాయణం ను జోడిస్తూ ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి కథలను తెరపై చూపించడంలోనే దర్శకుల నైపుణ్యం తెలుస్తుంది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి రాజమౌళి ఈ సినిమాను మరెలా తీర్చిదిద్దబోతున్నారో చూడాలి.
SSMB -29 సినిమా విశేషాలు..
మహేష్ బాబు హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా విషయానికి వస్తే.. భారీ అంచనాల మధ్య దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్.నారాయణ (KL.Narayana) సుమారుగా రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అటు రాజమౌళి కూడా బడ్జెట్లో ఒక రూపాయి కూడా వృధా కాకుండా చాలా పగడ్బందీగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి లీకులు సినిమా నుంచి బయటకు రావడం నిజంగా బాధాకరమని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.