BigTV English

OTT Movie : డ్రగ్ డీలర్ దగ్గర ప్రియురాలిని అడ్డంగా ఇరికించే ప్రియుడు… సీను సీనుకో ట్విస్ట్ తో అదిరిపోయే క్లైమాక్స్

OTT Movie : డ్రగ్ డీలర్ దగ్గర ప్రియురాలిని అడ్డంగా ఇరికించే ప్రియుడు… సీను సీనుకో ట్విస్ట్ తో అదిరిపోయే క్లైమాక్స్

OTT Movie : తెలుగులో ఒక మెరుపు మెరిసి, ఆ తరువాత హిందీలో బిజీ అయిపోయిన నటి తాప్సి. ఆ తరువాత బాలీవుడ్ లోకి వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదే జోరులో ఆమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే పాత్రల్లో నటిస్తూ, ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తోంది. తనకంటూ ప్రత్యేకంగా కధలను తయ్యారు చేసుకుంటున్నారు దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో, హీరోయిన్ డ్రగ్స్ కు అలవాటు పడతారు. ఒక డ్రగ్ వ్యవహారంలో హీరో చిక్కుకుంటాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు పిచ్చెక్కిస్తూ ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ బాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లూప్‌ల‌పేటా’ (Loop Lepete). 2022 లో విడుదలైన ఈ బాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి ఆకాష్‌ భాటియా దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్‌ ఇండియా, ఎలిప్సిస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై తనూజ్ గార్గ్, అతుల్ కాస్బేకర్, ఆయుష్ మహేశ్వరి ఈ మూవీని నిర్మించారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో తాప్సీ పన్ను, తాహిర్‌ రాజ్‌ భాసిన్‌, దీబ్ఎందు భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రతి సీన్ చాలా సస్పెన్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సైకలాజికల్ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ఒక ప్రమాదంలో గాయపడి స్పోర్ట్స్ కి దూరం అవుతుంది. తన కల నెరవేరదని తెలిసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది హీరోయిన్ . ఇంతలో హీరో అక్కడికి వచ్చి ఆమెను కాపాడతాడు. ఆ తరువాత ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. హీరో డ్రగ్స్ కి కూడా అలవాటు పడతాడు. హీరోకి ఒకరోజు తన యజమాని విక్టర్, డ్రగ్స్ ను వేరోకరికి ఇచ్చి డబ్బులు తీసుకొని రమ్మంటాడు. హీరో కూడా సరుకు ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. అయితే  ఆ డబ్బును బస్సులో ఒక చోట ఉంచుతాడు. అనుకోకుండా అక్కడ పోలీసులు రాగానే డబ్బులు వదిలి పారపోతాడు హీరో. విక్టర్ కి విషయం తెలిస్తే చంపేస్తాడని భయపడి వెంటనే హీరోయిన్ కు ఫోన్ చేస్తాడు. అయితే ఆమె నువ్వేం భయపడకు అంటూ డబ్బులు రెడీ చేయడానికి ప్రయత్నిస్తుంది. హీరో కూడా ఆ డబ్బులు కోసం వెతకడం ప్రారంభిస్తాడు. హీరోయిన్ డబ్బుల కోసం మొదట తన తండ్రి దగ్గరికి వెళ్లి అడుగుతుంది. తన దగ్గర అంత డబ్బు లేదని తండ్రి చెప్పడంతో, ఏంచేయాలో తెలీక తండ్రిని తిట్టుకుంటూ వెళ్తుంది. చివరికి డబ్బులు అరెంజ్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తుంది. ఈ సమస్య నుంచి హీరోబయటపడతాడా ? విక్టర్ చేతిలో వీళ్ళు బలి అవుతారా ? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లూప్‌ల‌పేటా’ (Loop Lepete) అనే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×