ఏలూరులోని జాతీయరహదారిపై వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు శివార్లోని వట్లూరు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. జాతీయ రహదారిపై వెనుక నుండి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనక సీట్లలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
స్వల్ప గాయాలు పాలైన ప్రయాణికులను ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. కంటైనర్ లారీ ఐరన్ లోడ్‌తో వెళ్తుంది.. ప్రమాదం జరిగిన వెంటనే కంటైనర్ లారీ డ్రైవర్ క్లీనర్ పరారయ్యారు. విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖ పట్నం నుండి విజయవాడ వెళ్తోంది.
మరోవైపు.. ఏలూరు జాతీయ రహదారిపై బస్సు ప్రమాదం జరిగింది. వట్లూరు సమీపంలో హైవేపై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 20 మందికి గాయాలయ్యాయి. నాలుగు రోజుల వ్యవధిలో ఏలూరు జిల్లాలోనే ఇది నాలుగో ప్రమాదం. నిత్య ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: ఆన్ లైన్ గేమ్స్‌కు బానిస.. డిగ్రీ స్టూడెంట్ ఆత్మహత్య
అన్నమయ్య జిల్లా మదనపల్లి లో రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు హైవే పై రెండు ప్రవేటు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 40 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రయాణికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలిసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.