Tollywood :సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఊహించని ఇమేజ్ సొంతం చేసుకొని అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైన ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికీ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో గొప్పగా చెప్పుకోవాల్సిన పేరు హరీష్ కుమార్ (Harish Kumar). యువకులకు ఈయన గురించి పెద్దగా తెలియదు కానీ 90ల్లో ఉన్న సినీ ప్రేమికులకు ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కెరియర్ ను అందుకునే క్రమంలోనే ఈయన సాధించిన రికార్డ్స్ మరో హీరో సాధించలేదు. నటుడిగా, హీరోగా, స్టార్ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇక హిందీ, తెలుగు, మలయాళం,కన్నడ, తమిళ్ ఇలా అన్ని భాషల్లో కూడా అతి తక్కువ సమయంలోనే 280 చిత్రాలు చేసిన ఈయన…పాతికేళ్ల వయసులోనే ఇన్ని సాధించారంటే ఇప్పుడు ఎలా ఉండాలి..? 50 ఏళ్ల వయసులో ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి..? అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే అసలు ఆయన ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరమయ్యారనే చెప్పాలి.
15 ఏళ్లకే స్టార్ స్టేటస్..
90వ దశకంలో ఇండియన్ సినీ పరిశ్రమకు మార్పు కాలం మొదలైంది. ప్రధాన సినిమాలలో స్థిరపడిన తారల వయసు ముదిరిపోతుండగా.. వారి స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన యువ నటులలో హరీష్ కుమార్ కూడా ఒకరు. అప్పుడు ఆయన వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. బాల నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈయన.. తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించారు. 1988లో కేవలం 13 సంవత్సరాల వయసులోనే హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టిన హరీష్ కుమార్.. దివంగత నిర్మాత రామానాయుడు (Ramanaidu )1990లో తీసిన ‘ ప్రేమఖైదీ’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే సినిమాను ఆ మరొసటి ఏడాది హిందీ రీమేక్ లో కూడా తెరకెక్కించారు. అయితే హిందీలో కరిష్మా కపూర్ (Karishma Kapoor) సరసన హరీష్ కుమార్ నటించగా.. తెలుగు, హిందీలో ఒకే సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు హరీష్ కుమార్.
అనుకోకుండా ఇండస్ట్రీకి దూరం..
తర్వాత కాలంలో పలు చిత్రాలలో నటించిన ఈయన అత్యుత్తమ యువనటులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఇక దాంతో స్టార్ హీరో అయిపోతారని అందరూ అనుకున్నారు. కానీ అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి. టాప్ స్టార్స్ అయినా రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, గోవిందా, నానా పటేకర్ వంటి హీరోల సినిమాలలో రెండవ హీరోగా చిన్న పాత్రలకే పరిమితం చేశారు. ఇక ది జెంటిల్మెన్ , హీరో నెంబర్ వన్, కూలీ నెంబర్ వన్ వంటి హిట్ చిత్రాలలో నటించాక.. 2001 ప్రాంతంలో అకస్మాత్తుగా తెరమరుగైన హరీష్.. మళ్ళీ పదేళ్ల తర్వాత తెరపై కనిపించారు. అది కూడా హిందీ చిత్రాలలో నటించారు. కానీ అవి పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్ల క్రితం “ఆ గయా హీరో” అనే చిత్రంలో గోవింద్ తో కలిసి నటించి, మళ్లీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలా 15 ఏళ్లకే స్టార్ స్టేటస్ ను చూసిన హరీష్.. ఇండస్ట్రీకి దూరమవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి.
అందుకే ఇండస్ట్రీకి దూరమైన హరీష్ కుమార్..
అంత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని.. ఇండస్ట్రీకి సడన్గా దూరం అవడానికి కారణం.. ఆయనకి చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదమే అని సమాచారం. ఆ ప్రమాదంలో గాయపడిన తర్వాత సంవత్సరాల తరబడి చికిత్స చేయించుకోకపోవడం వల్ల బ్యాక్ ప్రాబ్లం వచ్చిందని, లంబార్ వెరిబ్రా L3, L5 వంటి ప్రాంతాలలో స్లిప్డ్ డిస్క్ ఏర్పడింది. దీనివల్ల నడక కూడా కష్టమైందట. ఇక గాయాన్ని గుర్తించలేకపోవడం వల్ల ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని, తర్వాత నెలల తరబడి మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చిందని తెలిపారు..ఇక ప్రస్తుతం ఇండియాలోనే ఉంటూ ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి ప్రదేశాలు తిరుగుతూ.. స్వచ్ఛమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపు