NIA Arrest ZipLine Operator| పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణహోమంపై కేంద్ర సంస్థ ఎన్ఐఏ (నేషనల్ ఇన్‌వెస్టిగేటివ్ ఏజెన్సీ) విచారణ చేస్తోంది. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతంలో జిప్ లైన్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తిని విచారణ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి జరిగిన కుట్ర ఉండవచ్చుననే అనుమానం కారణంగా అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఉగ్రదాడి జరిగిన సమయంలో జిప్‌లైన్‌పై ప్రయాణిస్తున్న ఓ పర్యాటకుడు తీసిన వీడియోలో ఆ దాడి సంఘటన రికార్డ్ అయింది. వీడియాలోని దృశ్యాల ప్రకారం.. అప్పుడే కాల్పులు ప్రారంభమయ్యాయి, ఆ సమయంలో ఆపరేటర్ తనను ఏవిధంగా హెచ్చరించకుండానే “అల్లాహో అక్బర్” అని అరుస్తూ తనను ముందుకు నెట్టేశాడని గుజరాత్‌కు చెందిన పర్యాటకుడు రిషి భట్ తెలిపాడు. రిషి తీసిన వీడియో బయటపడిన తర్వాత స్థానికుడు, జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది.
ముజమ్మిల్ ను ప్రశ్నించిన తరువాత ఎన్ఐఏ అధికారులు మీడియాకు వివరాలు తెలిపారు. అయితే ముజమ్మిల్ చర్యలు సాధారణంగా ఒక ప్రతిచర్య మాత్రమేనని వారు అభిప్రాయపడ్డారు. ముజమ్మిల్ దాడులు జరిగిన సమయంలో “అల్లాహో అక్బర్” అని అరవడం అనుమానాస్పదంగా చూడనక్కర లేదని వారు తెలిపారు. “ఎవరైనా ఆపద సమయంలో తమ దేవుని పేరు జపించడం సహజమే. హిందువులు ఆపదలో “రామా” అని పిలుచుకునే విధంగా, తాను కూడా ప్రమాదకర స్థితిలో “అల్లాహో అక్బర్” అని పిలిచానని ముజమ్మిల్ వివరణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక్కడి వరకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, ప్రాథమిక విచారణలో ముజమ్మిల్‌కు ఈ ఉగ్రదాడిలో ప్రత్యక్ష సంబంధం లేదనిపించినప్పటికీ, అతని ప్రవర్తన పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐఏ అధికారులు అడిగిన ప్రశ్నలకు ముజమ్మిల్ వేర్వేరు సమధానులు ఇచ్చాడని జాతీయ మీడియా తెలిపింది.
దాడి జరిగిన సమయంలో కాల్పుల మధ్య జిప్‌లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ “అల్లాహో అక్బర్” అంటూ పర్యాటకుడిని ముందుకు తోసిన ఘటనపై ఇంతవరకు స్పష్టత లేదు. ఎన్‌ఐఏ అధికారులు ముజమ్మిల్‌ను ప్రశ్నించగా, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ తమ దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తోంది.
Also Read: 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ.. పెద్ద కథే!
ఈ విషయంలో ముజమ్మిల్ సోదరుడు ముఖ్తార్ లో ఓ జాతీయ మీడియా సంస్థ మాట్లాడింది. తన సోదరుడు ఉగ్రదాడి జరిగిన వెంటనే భయపడిపోయి.. తన ప్రాణాలు కాపాడుకోవడానికి పర్యాటకులను తోసుకుంటూ అక్కడి నుంచి పరుగులు తీశాడని అంతే తప్ప ఉగ్రదాడికి అతనికి ఏ సంబంధం లేదని చెప్పాడు.
ముజమ్మిల్ అరెస్టు పై కశ్మీర్ లో ప్రతిపక్ష పార్టీ అయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి మొహమ్మద్ ఇక్బార్ త్రుంబూ మీడియాతో మాట్లాడుతూ.. “పోలీసులు తమ విధానం మార్చుకోవాలి. కశ్మీరీలు, ముస్లింల సంస్కృతి గురించి తెలుసుకోవాలి. విచారణ చేసే సమయంలో ఇవి చాలా సాధారణ విషయాలు. ఏదైనా అనూహ్య ఘటన జరిగినప్పుడు బిస్మిల్లా.. లేదా అల్లాహు అక్బర్ అని అరవడం చాలా సామాన్య విషయం. భద్రతా వైఫల్యం జరిగిందనే కోణంలో ఎందుకు దర్యాప్తు జరగడం లేదు. భద్రతా సిబ్బంది అక్కడ ఎందుకు లేరు అనే విషయంపై అసలు చర్చ జరగడమే లేదు. కానీ అమాయక కశ్మీరీని మాత్రం అరెస్ట్ చేశారు. ఇది వారి విచారణ చేసిన తీరు.” అంటూ ఘాటుగా విమర్శించారు.