BigTV English

Intinti Ramayanam Today Episode: భానుమతిని బుక్ చేసిన కమల్.. అక్షయ్ కు వార్నింగ్ ఇచ్చిన అవని..

Intinti Ramayanam Today Episode: భానుమతిని బుక్ చేసిన కమల్.. అక్షయ్ కు వార్నింగ్ ఇచ్చిన అవని..

Intinti Ramayanam Today Episode April 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆరాధ్య కోసం బాక్స్ తీసుకొని వెళ్తుంది.. అప్పటికే ఆరాధ్యకు అన్నం పెట్టడం చూసి షాక్ అవుతుంది. అది చూసిన అవని షాక్ అవుతుంది. నా కూతురికి అన్నం పెట్టే బాధ్యతలు నీకు ఎవరు ఇచ్చారు అని అవని పల్లవిని అడుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన అక్షయ్ నేనే పల్లవిని చూసుకోమని చెప్పాను. ఆరాధ్య బాధ్యతలని పిన్నిగా పల్లవి చూసుకుంటుంది. నేనే ఆ  అధికారాన్ని  ఇచ్చాను నీలాంటి మోసగత్తేలు ఇలా నా కూతురు జీవితంతో ఆడుకుంటే అస్సలు సహించను అని అవనికి వార్నింగ్ ఇస్తాడు.. ఎవరిని చెప్పినా మీరు గుడ్డిగా నమ్మేస్తారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని అవని అంటుంది. పల్లవి ఇక ముందు ముందు నీకు వరుస షాక్ లు తగులుతాయని అంటుంది. అవనీ తన కూతురికి అన్నం పెట్టలేదని బాధపడుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అవని దగ్గరికి ఆరాధ్య తీసుకొచ్చి కాసేపు సంతోషంగా ఉండేలా చేస్తాడు. ఆరాధ్య ఇంట్లో ఆ విషయాన్ని కమల్ తో చెప్పడం పల్లవి వింటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆరాధ్య అవని దగ్గరికి వెళ్లిన విషయాన్ని చెప్తుంది. అది విన్న పల్లవి అక్షయ్ పార్వతీతో చెప్తుంది.. పార్వతి అక్షయలు మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీకరు లాయర్ గా అప్పుడప్పుడు కేసు కోట్లని తిరుగుతున్నాడు కానీ కమల్ మాత్రం ఆఫీస్ కి రావట్లేదు ఎలాగైనా వాన్ని దారిలో పెట్టాలి అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఆరాధ్యను అవనికి దూరం చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటుంటే పల్లవి సడన్గా ఎంట్రీ ఇస్తుంది. మీరు అనుకుంటున్నట్లు ఆరాధ్య అవనీని మర్చిపోవడం కాదు మావయ్య ఆరాధ్యను అవన్నీ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. రేపు కమల్ కూడా అవని దగ్గరికి తీసుకెళ్తాడు ఏదో ఒకటి చేయకుంటే మనం ఆరాధ్య కోసం ప్రణతిలాగే అవని దగ్గరికి వెళ్లాలని పల్లవి అంటుంది.

ఇక భానుమతి మా ఆయన ఇంకా రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ వాళ్ళ ఆయన కోసం పాటలు పాడుతూ ఉంటుంది. వస్తాడు నా రాజు ఈరోజు అంటూ పాట పాడగానే కమలాకర్ ప్రత్యక్షమవుతాడు. అక్కడ అప్సరసలు క్లాసిక్ డాన్సులు మాస్ డాన్సులు వేస్తుంటే నువ్వు ఇంకా వస్తాడు నా రాజు అంటూ పాటలు పడతావే డీజే టిల్లు అని పాడు అదే ఇప్పుడు ట్రెండు అని కమలంటాడు. పల్లవి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న భానుమతి కమలాక రూపంలో ఉన్న కమల్ ని కట్టేస్తుంది.. నువ్వు వస్తున్నావ్ అని చెప్తే ఎవరు నమ్మట్లేదు ఉండండి అన్నని పిలుచుకొని వస్తారని వెళ్తుంది. ఈ ముసలి నన్ను అడ్డంగా బుక్ చేసేలా ఉంది అని అనుకుంటాడు పల్లవిని భానుమతి వెళ్లి తీసుకొని వస్తారు. కమల్ ను కట్టేసి కనిపిస్తాడు. అది చూసి షాక్ అవుతుంది.


ఒసేయ్ ముసలి నీ మొగుడు అనుకొని నా మొగుడిని కట్టేసావు. నీ మొగుడు నా మొగుడు పోలికలు ఒకేలాగా ఉండడంతో ఇలా కట్టేస్తావా కొంచమైనా బుద్ధుందా? ఇప్పటికైనా ఆలోచించు నీ మొగుడు కాదు నీకు పిచ్చెక్కిందని తీసుకొని వెళ్తుంది పల్లవి.. ఇక తర్వాత రోజు ఉదయం అవని స్కూలుకు వెళ్లి ఆరాధ్య కోసం వెతుకుతుంది. స్కూల్లో ఆరాధ్య ఎక్కడ కనిపించదు. అక్కడ ఉన్న టీచర్లని అవని అడుగుతుంది. ఈ స్కూల్ కు ఆరాధ్య ను పంపడం ఇష్టం లేదన్నట్లుమాట్లాడారు అని టీచర్ చెప్తుంది.. అది విన్న అవని ఇంటికి వెళ్లి ఆ విషయాన్ని కనుకోవాలని అనుకుంటుంది..

ఆటోలో వెళుతుంటే మధ్యలో ఆటో ఆగిపోవడంతో కిందకు దిగుతుంది. పక్కనే ఆరాధ్యకు ఐస్ క్రీమ్ తినిపిస్తుంది. అది చూసిన అవని అక్కడికి వెళ్లి నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలనో చూస్తున్నావా స్కూలుకు పంపించకుండా ఏంటి ఇక్కడ అనేసి పల్లవిని అడుగుతుంది. ఆరాధ్యను నన్ను చూసుకోమని చెప్పారు బావగారు మీరు ఆ రోజు చెప్పింది వినలేదా అని పల్లవి అంటుంది. ఆరాధ్యను దగ్గరుండి నన్ను చూసుకోమని చెప్పారు కాబట్టే నేను చదువుతోపాటు అన్ని యాక్టివిటీస్ ఉంటేనే పిల్లల మైండ్ ఫ్రెష్ గా ఉంటుందని ఇలా తీసుకొని వచ్చాను అని పల్లవి అంటుంది.

 ఇది నీ దగ్గర తేల్చుకోవడం కాదు ఎవరి దగ్గర తెలుసుకోవాలో వాళ్ళ దగ్గర తేల్చుకుంటారని అవని ఆవేశంగా ఇంటికి వెళ్తుంది. అక్షయ్ ని పిలుస్తుంది. అవినీ కేకలు విని ఇంట్లోని వాళ్ళందరూ అక్కడికి వస్తారు. తల్లిని బిడ్డని వేరు చేయమని మీకు ఎవరు చెప్పారు అని అక్షయతో సీరియస్ గా మాట్లాడుతుంది. నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా మధ్యలో నీకేంటి ప్రాబ్లం అని అక్షయ్ అంటాడు. నువ్వు చేసిన తప్పుల్ని చూసి చూడనట్టు వదిలేసి నా బిడ్డను కూడా అలానే తయారు చేయడం నాకు ఇష్టం లేదు అందుకే స్కూల్ మార్పించాను అని అక్షయ్ అంటాడు.

 నేను ఏ తప్పు చేయలేదు. ఇది మీరెందుకు నమ్మట్లేదు నాకు అర్థం కావట్లేదు అని అవని అంటుంది. పార్వతి కూడా నువ్వు ఆస్తికోసం ఇంత గోతులు తగ్గుతావని నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావని అస్సలు అనుకోలేదు ఇక్కడ నువ్వు ఆరాధ్యతో మాట్లాడడానికి ఎవరికీ ఇష్టం లేదు. అలాంటిది నువ్వు ఎందుకు నా కూతురు అని ఆలోచిస్తున్నావని పార్వతి అంటుంది. అయితే అవని మాత్రం నేను కొందరి జీవితాలు నాశనం అవ్వకూడదు కుటుంబం చెల్లాచెదురు కాకూడదని వాటిని చూపించలేదు కానీ మీరు మాత్రం తల్లి బిడ్డల్ని వేరు చేస్తారా ఇదేంటి మావయ్య ఈ న్యాయమని అవని రాజేంద్రప్రసాద్ ని అడుగుతుంది.

 నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అమ్మ.. తల్లి బిడ్డను వేరు చేస్తే ఏం చేయాలో నీకు తెలుసు కదా అదే చెయ్ నువ్వు నీకు సపోర్ట్ గా నేనుంటాను అన్నట్లు రాజేంద్రప్రసాద్ మాట్లాడతాడు. నా బిడ్డ నా దగ్గరికి తెచ్చుకోవడానికి నేను ఏమైనా చేస్తాను అది గుర్తుపెట్టుకోండి అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని ఆరాధ్యను స్కూల్ మార్పించిన విషయాన్ని ప్రణతి వాళ్ళతో చెప్తుంది. తల్లి బిడ్డను వేరు చేయాలనుకోవడం ఎంత పాపము అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×