E-Paper
Advertisement

Coolie Movie: ‘దేవ’ పేరుతో స్టార్ హీరోల సినిమాలు.. అంత క్రేజ్ ఉందా, లిస్ట్ ఇదే?

Coolie Movie: ‘దేవ’ పేరుతో స్టార్ హీరోల సినిమాలు.. అంత క్రేజ్ ఉందా, లిస్ట్ ఇదే?
Advertisement

Star hero movies with Deva name: ఒక్కో పేరుకు ఒక్కో విధమైన స్టైల్ ఉంటుంది. ఇంకొన్ని పేర్లు ఐకానిక్‌గా అందరి మెదళ్లలో గుర్తుండిపోతాయి. అలాంటి పేరు కూడా చాలా మాస్ అండ్ క్లాస్‌గా ఉంటుంది. అయితే ఈ మధ్య అలాంటివే చాలా సినిమాలు వస్తున్నాయి. ఒక హీరో తన సినిమాలో పెట్టుకున్న పేరుతోనే.. మరికొందరు అవే పేర్లను ఫాలో అవుతున్నారు. అందువల్లనే అలాంటి పేర్లు అందరిలో గుర్తుండిపోతాయి. అలాంటి పేరుతో ఈ మధ్య వచ్చిన సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.

సలార్

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. ఎవరూ ఊహించని రేంజ్‌లో దూసుకుపోయింది. అయితే ఇందులో ప్రభాస్ ‘దేవ’గా కనిపించి అదరగొట్టేశాడు. అతడి పాత్రకు తగ్గ పేరు.. అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా పేరుకు తగ్గ కటౌట్‌కి మాస్ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో సినీ అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేని ప్రభాస్‌కు ‘సలార్’ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది.

ఈ సినిమాతో అటు ప్రభాస్‌కి ఇటు ఆయన అభిమానులకు ఆకలి తీరినట్లయింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. ఈ సినిమాలో ‘దేవ’ పేరును ఆయన అభిమానులకు బాగా నచ్చేసింది. ఆ పేరుకు తగ్గ మాస్ ఎలివేషన్ ఇవ్వడంలో సలార్ మూవీ మేకర్స్ సక్సస్ అయ్యారనే చెప్పాలి.

Advertisement

దేవర

దేవా.. ఆ పేరులో ఏదో మత్తు ఉందిరా

ఆర్ఆర్ఆర్ తర్వాత జూ.ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ ‘దేవర’గా కనిపించనున్నాడు. ఇందులో కూడా ‘దేవ’ అనే పేరు కలవడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ మోడ్‌లో కనిపించబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ‘దేవ’ర అనే పేరు కూమా ఎన్టీఆర్‌కు బాగా సూటబుల్‌గా ఉందనే చెప్పాలి. ఈ మూవీలో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఈ పేరు అయితేనే అద్భుతంగా ఉందని పలువురు అంటున్నారు. అదీగాక సలార్ మూవీలో దేవగా కనిపించిన ప్రభాస్ మంచి హిట్ అందుకున్నాడని.. ఇక ఎన్టీఆర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

కూలీ

సలార్, దేవర వంటి సినిమాల్లో స్టార్ హీరోలో దేవ, దేవర అనే పేర్లతో వస్తున్నారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా తన కొత్త సినిమాలో ‘దేవ’గా వస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఆ పేరుకు అంత క్రేజ్ ఏంటని కూడా చర్చించుకుంటున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా ‘కూలీ’. ఈ సినిమాలో అతడు ‘దేవ’గా కనిపించనున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. దీంతో దేవ పేరు రజినీకి సూపర్ గా సెట్ అయిందని ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమా రేంజ్‌ని మార్చేశాయి. ఇందులో వివిధ భాషలకు చెందిన నటీ నటులు భాగం అయ్యారు. టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి టామ్ చాకో, కట్టప్ప సత్యరాజ్ సహా శృతిహాసన్ వంటి నటీ నటులు ఇందులో భాగం అయ్యారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×