BigTV English

Sandeep Kishan: రోజుకు 350 మంది పేదలకు ఉచిత భోజనం..సందీప్ కిషన్ పై ప్రశంసల జల్లు

Sandeep Kishan: రోజుకు 350 మంది పేదలకు ఉచిత భోజనం..సందీప్ కిషన్ పై ప్రశంసల జల్లు

Tollywood Hero Sandeep Kishan help to woman in hospital 50 thousand: స్నేహగీతం , ప్రస్థానం సినిమాలతో పాపులర్ అయ్యారు సందీప్ కిషన్. ప్రముఖ కెమెరా మేన్ చోటా కే నాయుడు మేనల్లుడే అయినా..తన సొంత టాలెంట్ తోనే ఎదిగారు సందీప్. అయితే మొదటినుంచి సందీప్ కెరీర్ అంత సజావుగా నడవడం లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి పేరు వచ్చింది. అలాగే మంచు లక్ష్మి తో కలసి గుండెల్లో గోదారి మూవీ కూడా సందీప్ కెరీర్ కు హెల్ప్ అయింది. మధ్యలో వచ్చిన శమంతకమణి , ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాలు కూడా సందీప్ కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. రీసెంట్ గా వచ్చిన ఊరు పేరు భైరవ కోన మూవీతో యావరేజ్ విజయం అందుకున్నారు. అలాగే సందీప్ ఇటీవల ధనుష్ హీరోగా వచ్చిన రాయన్ మూవీలోనూ నటించారు. బాలీవుడ్ సినిమాలలోనూ నటించి మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే సందీప్ కిషన్ కొంత కాలం క్రితం వివాహ భోజనంబు అనే చైన్ రెస్టరెంట్లను ప్రారంభించారు.


350 మందికి ఉచిత భోజనాలు

కొద్ది కాలానికే వివాహ భోజనంబు రుచులు బాగున్నాయని పేరు రావడంతో ప్రస్తుతం వివాహ భోజనంబు రెస్టారెంట్లు లాభాల బాటలో ఉన్నాయి. అయితే తన రెస్టారెంట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కొంత మేరకు పేదల కోసం ఖర్చుపెట్టాలనే యోచనలో ఉన్నారు సందీప్. ఇప్పటికే రోజుకు 350 మంది పేదలకు ఉచిత భోజనాలు అందిస్తున్నారు. ఇకపై హైదరాబాద్ లో అతి తక్కువ దరకే భోజనం పెట్టే ఉద్దేశంతో క్యాంటీన్లు నిర్వహించాలనే ఐడియాలో ఉన్నారు సందీప్. మినిమం ధరకే కాస్ట్ లీ ఫుడ్ అందించాలని సందీప్ అనుకుంటున్నారట. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సందీప్ ఎంతో మందికి అన్నదానం చేస్తున్నారు ఇప్పటికే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఆలోచనతో ముందుకు సాగిపోతున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ గానూ సందీప్ తన మానవత చాటుకుంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చే దాదాపు అందరు హీరోలు తమ లాబాలను చూసుకుని..తమ పారితోషికం తీసుకుని తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. సందీప్ లాంటి నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలోనూ సందీప్ కిషన్ చాలా మందికి చదువు, ఆర్థిక సాయం అందించారు.


కన్నతల్లి ప్రాణాలు కాపాడి..

ఇటీవల ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తన తల్లి ఐసీయు లో చావుబతుకుల మద్య ఉందని..ఎవరైనా దాతలు అరవై వేలు సాయం అందించాలని పోస్టింగ్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసి సందీప్ కిషన్ స్పందించారు. అతనికి సంబంధించిన వివరాలు నిజమేనా అని ఎంక్వైరీ చేశారు. వెంటనే అవి నిజమేనని తేలడంతో అతని ఎకౌంట్ కు 50 వేలు డబ్బును ట్రాన్స్ పర్ చేశారు. ఇంకా ఏ రకమైనా సాయం కావాలన్నా చేస్తానని అన్నారు. దయచేసి సాయం చేస్తున్నారని ఫేక్ అకౌంట్ లు పెట్టవద్దని కోరుతున్నారు సందీప్ కిషన్. దీని వలన నిజంగా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందదని..ఫేక్ మెసేజ్ లతో ఎంతో కాలం తెలియకుండా మేనేజ్ చేయలేరని అన్నారు.

రీల్ కాదు రియల్ హీరో

ఇలా సోషల్ మీడియా వేదికగా ఓ తల్లి ప్రాణాలు కాపాడిన సందీప్ కిషన్ ఔదార్యానికి మెచ్చుకోకుండా ఉండలేమని నెటిజన్స్ పోస్టింగులు పెడుతున్నారు. ఓ పక్క ఉచిత అన్నదానాలు, మరో పక్క ఆర్థిక సాయం ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా వెంటనే స్పందిస్తున్న సందీప్ కిషన్ రీల్ స్టార్ కాదు..ఆయన రియల్ స్టార్ అని ట్రోలింగులు పెడుతున్నారు. అయితే ట్విట్టర్ వేదికగా సందీప్ కిషన్ పెట్టిన పోస్టింగ్ కు తెగ లైకులు వస్తున్నాయి. ఎందరో హీరోలకు సందీప్ ఆదర్శంగా నిలిచారని కీర్తిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×