BigTV English
Advertisement

Rajinikanth: దేవా.. ఆ పేరులో ఏదో మత్తు ఉందిరా

Rajinikanth: దేవా.. ఆ పేరులో ఏదో మత్తు ఉందిరా

Rajinikanth:  సూపర్ స్టార్ రజినీకాంత్ .. తన వయస్సుకు మించి సినిమాలు చేస్తున్నాడు. కుర్ర హీరోలు కూడా అన్ని సినిమాలు చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రస్తుతం రజినీ నటిస్తున్న చిత్రాల్లో కూలీ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.


ఇక లోకేష్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ క్యాస్టింగ్ తో నింపేసాడు. విక్రమ్, లియో సినిమాలే అందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు కూలీ లో కూడా అదే పంధాను అనుసరిస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌభిన్ సాహిర్, మహేంద్రన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అంతేకాకుండా వారి క్యారెక్టర్స్ నేమ్స్ ను కూడా రివీల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. నాగార్జున సైమన్ గా నటిస్తుండగా.. శృతి.. ప్రీతిగా కనిపిస్తుంది. ఇక ఇలా ఈరోజు రజినీ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. కూలీ సినిమాలో రజినీదేవా  అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.


ఇక ఈ పోస్టర్ లో రజినీ  ఉబర్ కూల్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. ఇక చేతిలో 1421 అనే నంబర్ ప్లేట్ ను పట్టుకొని తదేకంగా చూస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పోస్టర్ గురించి పక్కన పెడితే.. రజినీ క్యారెక్టర్ నేమ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

దేవా.. ఈ మధ్య స్టార్ హీరోల క్యారెక్టర్స్ కు కరెక్ట్ గా సరిపోతున్న పేరు. సలార్ లో ప్రభాస్ క్యారెక్టర్ దేవా.. సలార్ దేవరథ రైజర్. అప్పటినుంచి ఈ పేరు మారుమ్రోగిపోతూ వస్తుంది. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ పేరు కూడా దేవా అని సమాచారం.

ఇప్పుడు రజినీ క్యారెక్టర్ నేమ్ కూడా దేవానే. దీంతో ఈ దేవా పేరులో ఏదో మత్తు ఉందిరా.. ఇట్టే కనెక్ట్ అవుతుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో రజినీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×