Star Heroine..సాధారణంగా సినీ సెలెబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారు ఎక్కడ కనిపించినా.. వారితో మాట్లాడాలని, వారితో ఫోటో దిగాలని, కరచాలనం చేయాలి అని ఎంతోమంది ప్రజలు ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఇలా అభిమానులు, సినీ ప్రేమికులు.. సెలబ్రిటీలు కనబడితే చాలు ఎగబడిపోతారుm ఇలాంటి వారి వల్ల అటు సెలబ్రిటీలు కూడా ఎన్నో అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. అటు అభిమానుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ప్రత్యేకంగా కోట్ల రూపాయలను చెల్లిస్తూ బౌన్సర్లను కూడా నియమించుకుంటున్నారు. ఇక సెలబ్రిటీ కావడం చేత సామాన్య ప్రజలు లాగా బ్రతకలేకపోతున్నారు. ఇదే విషయాన్ని చాలామంది సెలబ్రిటీలు బాధపడుతూ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా ప్రయాగ్ రాజ్ వేదికగా మహాకుంభమేళ గత కొన్ని రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. త్రివేణి సంగమం వద్ద దేశం నలుమూలల నుండి ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు సుమారుగా 60 కోట్ల మందికిపైగా ప్రజలు త్రివేణి సంఘంలో స్నానమాచరించినట్లు సమాచారం.
అటు సినీ ఇండస్ట్రీ నుండి కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి, ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఇప్పుడు ఒక భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ మహాకుంభమేళాలో కనిపించడంతో.. అభిమానుల దాటికి తట్టుకోలేక ఆమె ఇబ్బందులు పడింది. ఆమె పవిత్ర స్నానం ఆచరించడానికి త్రివేణి సంగమం కి వస్తే.. ఆమెతో సెల్ఫీ దిగడానికి అభిమానులు పోటెత్తారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..మీరెక్కడ తయారయ్యార్రా.. కనీసం ఆమెను పూజ కూడా చేసుకోనివ్వరా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుర్రాళ్ళ క్రేజీ క్రష్ కత్రినా కైఫ్ (Katrina Kaif).
జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 తో అంటే నేటితో ముగియనుంది. దీనికి తోడు మహాశివరాత్రి కావడంతో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. అటు సినీ తారలు కూడా పెద్ద ఎత్తున మహాకుంభమేళాను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మహాకుంభమేళాకు వచ్చారు హీరోయిన్ కత్రినా కైఫ్.తన అత్తమ్మ (హీరో విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ ) తో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు. అయితే కత్రినా కుటుంబీకులు స్నానం ఆచరిస్తుండగానే.. కొందరు అభిమానులు కత్రినాను చుట్టుముట్టారు. సెల్ఫీలు తీసుకోవడానికి భారీగా ఎగబడ్డారు. అయితే ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో సెలబ్రిటీల కోసం అభిమానులు ఇలా ఎగబడటం ఏమాత్రం బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా త్రివేణి సంగమానికి వెళ్లిన కత్రినా కైఫ్ కి అక్కడ చేదు ఘటన ఎదురైందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఒక సామాన్యురాలి గానే అక్కడికి వెళ్లిన ఈమెకు సెలబ్రిటీ అనే ట్యాగ్ కారణంగా మనశ్శాంతిగా స్వామి వారిని దర్శించుకోలేకపోయారనే బాధ ఆమెలో ఎప్పటికీ ఉంటుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.