BigTV English

Preity Zinta: పంజాబ్ ఓనర్ పై సంచలన ఆరోపణలు.. రూ.18 కోట్ల మింగేసిందంటూ ?

Preity Zinta: పంజాబ్ ఓనర్ పై సంచలన ఆరోపణలు.. రూ.18 కోట్ల మింగేసిందంటూ ?

Preity Zinta: బాలీవుడ్ నటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} పంజాబ్ జట్టు సహా యజమాని ప్రీతి జింటా తాజాగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి జింటా తన సోషల్ మీడియా అకౌంట్లు బిజెపికి అప్పగించినందుకు ఓ బ్యాంకులో ఆమె తీసుకున్న కోట్ల రుణం మాఫీ అయిందని ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్ యూనిట్ ఎక్స్ {ట్విట్టర్} వేదికగా ఓ పోస్ట్ చేసింది.


Also Read: Rohit Sharma – Dilip: దుబాయ్ రోడ్లపై రోహిత్… వైన్ షాప్ కోసమే అంటూ ట్రోలింగ్?

న్యూ ఇండియా కో – ఆపరేటివ్ బ్యాంకులో ప్రీతి జింటా రూ. 18 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలను బిజెపికి అప్పగించడంతో.. ఆ మొత్తం రుణం మాఫీ అయిందని, గతవారం ఆ బ్యాంకును మూసివేయడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని కేరళ కాంగ్రెస్ విభాగం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై ప్రీతి జింటా ఘాటుగా స్పందించింది. తనపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని.. తాను తన సోషల్ మీడియా ఖాతాలను ఎవరికి అప్పగించలేదని స్పష్టం చేసింది.


పది సంవత్సరాల కిందటే తాను బ్యాంక్ నుండి తీసుకున్న రుణాన్ని తీర్చివేశానని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై ప్రీతి జింటా స్పందిస్తూ..” నా సోషల్ మీడియా అకౌంట్లను నేనే సొంతంగా నిర్వహించుకుంటున్నాను. వాటిని ఎవరికీ అప్పగించలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. పదేళ్ల కిందటే ఆ బ్యాంకు నుండి నేను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేశాను. కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ చూసి విస్తుపోయాను. నాకు ఎవ్వరూ, ఏ రుణాన్ని మాఫీ చేయలేదు. ఓ రాజకీయ పార్టీ నా పేరును వాడుకొని తప్పుడు సమాచారం ఎలా ప్రచారం చేస్తుంది.

భవిష్యత్తులో ఎటువంటి అపోహలు, అపార్ధాలు రాకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోస్ట్ పై నేను స్పందిస్తున్నాను” అని పేర్కొంది ప్రీతి జింటా. ఇక ముంబైలోని న్యూ ఇండియా కో – ఆపరేటివ్ బ్యాంకు జనరల్ మేనేజర్, అకౌంట్స్ హెడ్ హితేష్ మెహతా బ్యాంకు నుండి రూ. 122 కోట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక నేరం కేసులో ప్రస్తుతం హితేష్ మెహతా ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Also Read: ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ దెబ్బ.. 100 మందికిపైగా ఉద్యోగాలు పీకేసిన పాక్ !

ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రీతి జింటాపై కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే ఈ ఆరోపణలపై ప్రీతి జింటా స్పష్టత ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీ తాము తప్పుడు పోస్ట్ చేసినట్లు అంగీకరించింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ” ఇతర సెలబ్రిటీల మాదిరిగా కరుడుగట్టిన ఐటీ విభాగాలకు అప్పగించకుండా.. మీ ఖాతాలను మీరే నిర్వహిస్తున్నట్టు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీడియా వార్తల ఆధారంగా మేము ఈ పోస్ట్ చేశాం. మేం ఏదైనా తప్పు చేసి ఉంటే దానిని ఒప్పుకుంటున్నాం” అని ట్వీట్ చేసింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×