BigTV English

Star Heroines: ఆ స్టార్ హీరోయిన్స్ ని టాలీవుడ్ పక్కన పెట్టేసినట్టేనా..?

Star Heroines: ఆ స్టార్ హీరోయిన్స్ ని టాలీవుడ్ పక్కన పెట్టేసినట్టేనా..?

Star Heroines:ఒకప్పుడు టాలీవుడ్ (Tollywood)సినీ ఇండస్ట్రీలో నయనతార(Nayanthara), సమంత(Samantha), రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), తమన్నా(Tamannaah) లాంటి సీనియర్ హీరోయిన్స్ ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరు లేనిదే సినిమాలు కూడా ఉండేవి కాదు. అయితే ఈ మధ్యకాలంలో కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపుగా చాలామంది దర్శకనిర్మాతలు వీరిని దూరం పెట్టేసారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. టాలీవుడ్ వీరిని దూరం పెట్టిందా.. లేక వీరే టాలీవుడ్ ని దూరం పెట్టారా? అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత చాలా వరకు బాలీవుడ్ లోనే అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోతున్నారు.


టాలీవుడ్ కి దూరం అవుతున్న సీనియర్ హీరోయిన్స్..

ఒకప్పుడు ఏది పడితే ఆ పాత్ర చేసి గ్లామర్ రోల్స్ కూడా పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు, ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే గానీ ఓకే చెప్పడం లేదు. దీంతో సినిమా సినిమాకి మధ్య గ్యాప్ కూడా భారీగానే పెరిగిపోయింది. ఇతర భాషల మీద ఆసక్తితో టాలీవుడ్ ని పక్కన పెట్టేస్తారు. ఉదాహరణకు సమంత.. ఖుషీ తర్వాత సమంత తెలుగులో మరో సినిమా చేయలేదు. సొంత నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేసి..’ మా ఇంటి బంగారం’ సినిమాను ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్ పైకి వచ్చిన దాఖలాలు లేవు. మొన్నా మధ్య ఒక ఇంటర్వ్యూలో రానాతో అవకాశాలు లేకే టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యానని చెప్పింది. కానీ ఇప్పటి వరకు వచ్చిన అవకాశాన్ని ఆమె అందుకున్నట్లు కనిపించడం లేదు. ఇక నయనతార కూడా అంతే. ఆమెకు అవకాశాలు వచ్చినట్టు కనిపించడం లేదు.


ఇప్పటికీ అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్స్ వీరే..

మరోవైపు పక్కింటి అమ్మాయిలా కనిపించే నిత్యమీనన్ (Nithya Menon) కూడా తెలుగు పరిశ్రమకు దూరం అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా ‘భీమ్లా నాయక్’ (Bheemla Naik)సినిమా చేసిన ఈమె ప్రస్తుతం జయం రవి (Jayam Ravi)తో సినిమా చేస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కూడా అంతే చివరిగా ‘కొండపొలం’ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. ఇక వీరంతా కూడా టాలీవుడ్ కి దూరం అయినట్టే.. ఇక మరోవైపు కాస్తో కూస్తో కాజల్ , అనుష్క అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. కాజల్ చివరిగా బాలయ్య (Balakrishna) సరసన ‘భగవంత్ కేసరి’లో అలరించి ఆ తర్వాత ‘సత్యభామ’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంతో కూడా ఆకట్టుకుంది. మరొకవైపు అనుష్క నవీన్ పోలిశెట్టి (Naveen polishetty)తో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా చేసి అలరించింది. ఇక ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తమన్నా ఏమో ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమా చేస్తోంది. ఇక అలా కొంతమంది టాలీవుడ్ పై ఆసక్తితో ఇక్కడే సినిమాలు చేస్తుంటే, మరి కొంతమంది సీనియర్ హీరోయిన్స్ టాలీవుడ్ కి పూర్తిగా దూరం అవుతున్నారు. మొత్తానికైతే కొత్త రంగులు వచ్చిన తర్వాత సీనియర్స్ కి అవకాశం లేకుండా పోయిందనేది స్పష్టంగా వినిపిస్తోంది

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×