Anam Venkata Ramana Reddy: జగన్ పై ఆనం వెంకటరమణా రెడ్డి మరోసారి మాస్ ర్యాగింగ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో మీడియా ముందు మాట్లాడుతూ.. తమ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకోవాలని SECI జూన్ 2020లో రాష్ట్రాలతో అగ్రిమెంట్ చేసుకుందన్నారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో జగన్‌కు200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని ఆనం ఆగ్రం వ్యక్తం చేశారు. 18 నెలలు దాటినా, ఏ ఒక్క రాష్ట్రం కూడా విద్యుత్ కొనడానికి ముందుకు రాలేదన్నారు. అంత ఎక్కువ ధరకు విద్యుత్ కొనలేం, మాకు మీ కరెంటు వద్దు అంటూ అన్ని రాష్ట్రాలు దండం పెట్టాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, మేము కొంటాం అంటూ ముందుకు వచ్చింది. అన్ని రాష్ట్రాలు వద్దు అంటుంటే, జగన్ రెడ్డి మాత్రం మాకు కావాలి అంటూ ఎక్కువ ధరకు విద్యుత్ కొనడానికి ఒప్పుకున్నాడు. ఇది చెప్పింది మేము కాదు, అమెరికా కోర్టు అని అనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టు 2021లో అర్ధరాత్రి ఒంటి గంటకు విద్యుత్ కొనుగోలు ఫైల్ పరుగెత్తింది. అధికారులు, మంత్రులు ఆఘమేఘాల మీద అర్ధరాత్రి పరుగులు తీసారు. సీబీఐ, ఈడీ కేసులు ఏంటి.. అమెరికా కోర్టులో జగన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. న్యూయార్క్‌లో అవినీతి గ్లామర్ బాయ్‌గా జగన్ రెడ్డి పేరు మోత మోగుతోంది. అవినీతి సామ్రాజ్యాధిపతి జగనన్న చిట్టాను FBI గుర్తించిందని ఆనం కామెంట్స్ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద గజదొంగ జగన్ రెడ్డి అని అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఏజెన్సీ చెప్పిందని విమర్శలు గుప్పించారు. భారతదేశంలో ప్రతి డిస్కంలు వద్దు అంటే.. జగన్ మాత్రం కాలాలి.. కావాలి అన్నాడు.. అని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: పాల్ జైలు పాలయ్యాడు సరే.. అసలు సూత్రధారి ఎక్కడ? – రఘురామ
జగన్ రెడ్డి ఏకంగా రూ.1750 కోట్ల లంచాలు డైరెక్ట్‌గా తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని FBI చెప్పిందని అని ఆయన అన్నారు. ఇక్కడ సిబిఐ కేసులు లాగా పదేళ్ళు, 20 ఏళ్ళు సాగుతాయి అనుకుంటున్నావ్ ఏమో.. అమెరికా కోర్టులు ఏడాది లోపే తేల్చేస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్న ఆఫ్ టికెట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ లవర్ బాయ్.. కలాం రెడ్డి.. రండిరా రండి మాస్ ర్యాగింగ్ చేశారు. జగన్ రెడ్డి, అమెరికా జైల్లో బ్రెడ్డు, జాం మాత్రమే పెడతారు. ఇంటి నుంచి చేపల పులుసు, మటన్ బిర్యానీ తెచ్చుకునే వీలులేదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.