BigTV English

Star Producer: ప్రకాష్ రాజ్ వల్ల రూ.1 కోటి నష్టపోయా.. నిర్మాత కామెంట్స్ వైరల్..!

Star Producer: ప్రకాష్ రాజ్ వల్ల రూ.1 కోటి నష్టపోయా.. నిర్మాత కామెంట్స్ వైరల్..!

Star Producer.. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj).తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతో మంది యువతను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన నటించని పాత్ర లేదంటే సందేహం లేదు. తండ్రిగా, విలన్ గా, కమెడియన్ గా ఇలా ఏ పాత్ర అయినా సరే ఈజీగా నటించేసి అందరి మన్ననలు పొంది, విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తున్న ప్రకాష్ రాజ్ .. తాజాగా ఒక నిర్మాతను మోసం చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.


నిర్మాతను మోసం చేసిన ప్రకాష్ రాజ్..

తనకు కోటి రూపాయల నష్టం కలిగించాడు అని, ప్రముఖ కోలీవుడ్ నిర్మాత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత వినోద్ కుమార్ (Vinod Kumar) తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్ నిధి స్టాలిన్ తో ప్రకాష్ రాజ్ కూర్చున్న ఫోటోని షేర్ చేస్తూ.. నీతో ఉన్న ఈ ముగ్గురు ఎన్నికలలో గెలిస్తే మీరు డిపాజిట్ కూడా దక్కించుకోలేరు. అది మీ మధ్య తేడా.. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లడంతో నాకు కోటి రూపాయల నష్టం వచ్చింది. కాల్ చేస్తానని ఇప్పటివరకు మీరు చేయలేదు.. అంటూ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు వినోద్ కుమార్. ఇకపోతే ప్రకాష్ రాజ్ తో వినోద్ కుమార్ ఎనిమీ అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇకపోతే కోటి రూపాయల నష్టం అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


మత కల్లోలాలు సృష్టించవద్దు..

ఇకపోతే ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ అయిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ నేరుగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి విషయాలను అక్కడే పూర్తి చేయాలి కానీ రాజకీయం చేసి మత కల్లోలాలు సృష్టించొద్దు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఈ విషయంపై కూడా కామెంట్లు చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్స్ చాలా వైరల్ గా మారాయి.

ఏంటి సిగ్గులేని రాజకీయాలు..?

దీనికి తోడు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. సమంతా – నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ అక్కినేని ఫ్యామిలీ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అసలు ఏంటి సిగ్గులేని రాజకీయాలు .. సినిమా ఆడవారంటే మీకు అంత చులకనా..? జస్ట్ ఆస్కింగ్.. అంటూ మరో ట్వీట్ వదిలారు. అలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రకాష్ రాజ్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పుడు తనపై కూడా నిందపడింది. ఈ నిందకు ఆయన రిప్లై ఇస్తారా? లేక సైలెంట్ అయిపోతారా ? అన్నది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×