BigTV English

Trinayani Serial Today October 6th: ‘త్రినయని’ సీరియల్‌: పాపే పెద్దమ్మ అన్న విక్రాంత్‌ – కాదన్న విశాల్‌ – నిరూపిస్తానన్న విక్రాంత్‌

Trinayani Serial Today October 6th: ‘త్రినయని’ సీరియల్‌: పాపే పెద్దమ్మ అన్న విక్రాంత్‌ – కాదన్న విశాల్‌ – నిరూపిస్తానన్న విక్రాంత్‌

trinayani serial today Episode:  విశాల్ ఆలోచిస్తుంటే నయని వచ్చి ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. కొత్త బ్రాంచి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు విశాల్‌. దీంతో మీరేదో దాస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటుంది నయని. నువ్వు ఎక్కువగా ఆలోచించకు నయని అంటాడు విశాల్‌. మనం తెలుసుకోవాల్సిన నిజాన్ని నాలుగు రోజుల్లో బయటకు తీసుకురావాలి. తీసుకువస్తాను అంటుంది. నయని మరోవైపు విక్రాంత్‌ లాప్‌టాప్‌ లో వర్కు చేసుకుంటుంటే సుమన వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది.


దీన్ని కూడా  ప్యాంటుకో షర్టుకో కట్టుకుని పూజ చేయాల్సింది అంటుంది. అలా ఎలా కట్టుకుంటారని విక్రాంత్‌ అడుగుతాడు. భుజంగమణిని కొంగుకు కట్టుకుని మీ అమ్మ పూజ చేసింది కదా అలాగా అంటుంది సుమన. దీంతో నక్క బ్యాచ్‌ అంతా డిస్సపాయింట్‌ అయినట్టు ఉందే అంటాడు విక్రాంత్‌. అవును నాకైతే సువర్ణ అవకాశం మిస్‌ అయినట్టు ఉంది అంటుంది. దీతో నెత్తి మీద నెమలీక పెట్టుకుని కృష్ణుడి గుడికి వెళ్లి పించాన్ని ప్రసాదం అడిగినట్టు ఉంది అంటాడు విక్రాంత్‌. అయితే అర్జెంట్‌గా ఆరా తీయడం మొదలుపెట్టండి అని చెప్తుంది సుమన. గాయత్రి పాప జోగయ్యశాస్త్రి గారి మనవరాలు  కాదని లలిత అత్తమ్మ ఎలా అంది.. తెలుసుకోండి అని చెప్తుంది సుమన.

రాత్రికి గార్డెన్‌ లో కూర్చుని విశాల్‌ ఆలోచిస్తుంటాడు. విక్రాంత్ ఫైల్‌ తీసుకుని వచ్చి విశాల్‌ ను చూడమని చెప్తాడు. విశాల్ ఉలకడు, పలకడు. ఇంతలో నయని వచ్చి మీ బ్రో ఏదో చెప్పలేనంత ఇదిగా ఆలోచిస్తున్నారు  విక్రాంత్‌ బాబు. ఏదైనా ప్రాబ్లమా వదినా..?  చెప్పేది వినిపించుకోవడం లేదు. మనిషి వచ్చి పకలరించినా పట్టించుకోవడం లేదు అని చెప్తాడు విక్రాంత్‌. దీంతో విశాల్‌ ఏం లేదని చెప్తాడు.


విషయం ఏంటో కానీ మీరిద్దరూ నాకు చెప్పటం లేదు అనగానే నేను గాయత్రి పాప గురించి ఆలోచిస్తున్నాను అంటాడు విశాల్‌. నయని కూడా అదే ఆలోచిస్తున్నాను అంటుంది. అయితే డెలివరీ రోజు జీవం ఎత్తుకెళ్లిపోయిన పాప గాయత్రే అని మీరు అనుకుంటున్నారు కదా అని విక్రాంత్  అడుగుతాడు. అనుకుంటే నిజం అవుతుందా? విక్రాంత్‌ బాబు అంటుంది నయని. అవుతుంది. రేపు ఒక ఎక్స్‌పర్‌మెంట్‌ చేద్దాం అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు.

మరుసటి రోజు విక్రాంత్‌ ఏదో చేస్తుంటే నయని చూస్తుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన సుమన మీకెందుకండి శ్రమ అంటుంది. వీడు చేసిన మంచి పనిని అభినందించాలి సుమన. నయని కూడా ఇక్కడే ఉండి గమనిస్తుంది అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో గాయత్రి పాపను తీసుకురమ్మని అన్నయ్యకు చెప్పండి అనగానే వల్లభ చెప్తాడు. విశాల్‌ గాయత్రి పాపను  బయటకు తీసుకెళ్లే ముందు నువ్వు మా అమ్మవు అనే నిజం వాళ్లకు తెలియకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి తీసుకెళ్తారు.

బయట ఇంకా రావడం లేదేంటి అని ఎదురుచూస్తుంటారు. ఇంతలో విశాల్ పాపను తీసుకుని అక్కడకు వస్తాడు. పాప ఈరోజు నువ్వెవరు నిరూపిస్తానని విక్రాంత్‌ బాబు ఏర్పాట్టు చేస్తున్నాడు తెలుసా? అంటుంది నయని. మా ఆయన తెలివైన వాడైనట్టు చెప్తున్నారేంటి అక్క అంటుంది సుమన. ఇంట్లో అందరికన్నా తెలివైన వాడు విక్రాంతే సుమన అంటాడు విశాల్‌.

కానీ ఏం లాభం బావగారు ఆ తెలివిని ఇలా సంఘ సేవకు వినియోగిస్తున్నారు  తప్పితే ఆయన కోసం ఉపయోగిస్తే మీలా కోట్లు సంపాదించేవాడు అని సుమన అనడంతో.. విక్రాంత్‌ కోపంగా నువ్వు సందర్భం కానీ విషయాలు మాట్లాడి నన్ను డిస్టర్బ్‌ చేయకు అంటుంటే అదంతా ఉండని కానీ నువ్వు నిజాన్ని ఎలా నిరూపిస్తావో చెప్పు అని వల్లభ అడగ్గానే నేను అంతా పరిశీలించాక తెలిసిందేంటంటే గాయత్రి పెద్దమ్మ ఎప్పుడు వచ్చినా.. అప్పుడు గాయత్రి పాప ఉండటం లేదు అని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు.

విశాల్‌ మాత్రం వీడు మొత్తం కనిపెట్టినట్టు ఉన్నాడు. అని మనసులో అనుకుంటాడు. సుమన, నయని కూడా తాము ఈ విషయం గమనించామని చెప్తారు. దీంతో లేదని విశాల్‌  పాప ఉన్నప్పుడు కూడా మా అమ్మ వచ్చిందని చెప్తాడు. నయని కూడా అవును అంటుంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి ఉందని పాప నిద్ర పోయినప్పుడు వస్తుంది అని ఇప్పుడు పెద్దమ్మను పిలవండి అని నయనికి చెప్తాడు విక్రాంత్‌.

వద్దులే బలవంతంగా అమ్మని రమ్మని పిలవడం ఎందుకు అంటాడు విశాల్‌. అందరూ పిలవండి అని చెప్తారు. నయని అమ్మగారు మీరెక్కడున్నా సరే ఇక్కడికి రావాలి. మా అనుమాన్నాన్ని నివృత్తి చేయాలి అని పిలుస్తుంది. దీంతో విక్రాంత్‌ రారు. గాయత్రి పాప మెలుకువగా ఉంది కాబట్టి పెద్దమ్మ రారు అని చెప్తాడు. ఒకవేళ పాప మెలుకువతో ఉండి పెద్దమ్మ వస్తే అని వల్లభ డౌట్‌ క్రియేట్‌ చేస్తాడు. అప్పుడు కూడా  నో కనెక్షన్‌ నో రిలేషన్‌ అంటాడు విక్రాంత్‌. దీంతో పాపను నిద్రపుచ్చేందుకు విక్రాంత్‌ ప్రయత్ని్స్తాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×