Allu Arjun Case:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun) కేస్ ఎంతలా హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ‘పుష్ప 2’ బెనిఫిట్ షో కారణంగా ఒక మహిళ మరణించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు ఆయన పోలీసుల పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయాలు కాస్త ఇండస్ట్రీ – ప్రభుత్వం అన్నట్టుగా వార్తలు వినిపించాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయిపోయి, ఏకంగా సినీ సెలబ్రిటీలపై మండిపడింది. ఒక మహిళ మరణిస్తే కనీసం పరామర్శించాల్సింది పోయి.. ఒక సెలబ్రిటీ జైలుకు వెళ్లి వెంటనే తిరిగి రావడంతో.. అతని ఇంటికి బారులు తీరారు. అతడికి కాలు పోయిందా? కన్ను పోయిందా? అంటూ మండిపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఇక బెనిఫిట్ షో కారణంగానే ఒక మహిళ ప్రాణం కోల్పోవడంతో సీరియస్ అయిన ఆయన.. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రజలకు అనుకూలంగా మద్దతు పలికారు. దీంతో సినీ సెలబ్రిటీలందరూ కూడా అలర్ట్ అయ్యి.. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు(Dil Raju) నేతృత్వంలో 36 మంది సెలబ్రిటీలు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి.. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియో వేసి మరీ అసలు పరిస్థితి వివరించారు.
బయటకొచ్చాక పద్ధతిగా ఉండాలి – సురేష్ బాబు
ఇదిలా ఉండగా మరోవైపు.. మీటింగ్ అనంతరం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) స్పందిస్తూ.. ఒక ఇంటర్వ్యూలో కీలక కామెంట్లు చేశారు. “నీ ఇంట్లో నువ్వు ఎలాగైనా ఉండు.. కాని బయటకు వచ్చిన తర్వాత పద్ధతిగా ఉండాలి” అంటూ అభిమానులను ఉద్దేశించి సురేష్ బాబు అంటే.. ఈ కామెంట్లను అల్లు అర్జున్ కి ఆపాదిస్తూ యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేశారు. ఈ విషయం సురేష్ బాబు వరకు వెళ్లడంతో ఆయన తాజాగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బన్నీపై కామెంట్స్ అంటూ రూమర్స్.. సురేష్ బాబు క్లారిటీ..
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “నాకు సోషల్ మీడియాలో ఏదైనా చూడాలంటేనే అసలు ఇష్టం ఉండదు. అందుకే నేను పెద్దగా ఫాలో అవ్వను. అయితే ఈరోజు ఉదయం నాకు ఎవరో పంపించారు. నేను బన్నీని ఏదో అన్నాను అంటూ. అసలు వాడిని నేను ఏదో అనడమేంటి? చిన్నప్పటి నుంచి బన్నీ నాకు తెలుసు.. నా కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ కూడా.. వాడి గురించి నేను ఎందుకు ఏదో అంటాను? అలా ఎందుకు రాశారు? పైగా నేను అన్నానని డైరెక్టుగా చెప్పలేదు.. మేబీ అని కూడా రాశారు.. అలా రాయడం ఎందుకు?” అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియోలను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆంటీ ఫ్యాన్స్ కి కౌంటర్లు ఇస్తున్నారు. సురేష్ బాబు అనకున్నా.. అన్నట్లు పోర్ట్రైట్ చేస్తూ పోస్ట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా అలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా బన్నీని అన్నాడు అంటూ వస్తున్న వార్తలకు ఒక్క మాటతో చెక్ పెట్టారు సురేష్ బాబు.