BigTV English

Game changer : ఒక్క రోజు ‘ గేమ్ ఛేంజర్ ‘ కోసం అంత ఖర్చు చేశారా..?

Game changer : ఒక్క రోజు ‘ గేమ్ ఛేంజర్ ‘ కోసం అంత ఖర్చు చేశారా..?

Game changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.. ఈ మూవీని జనవరి 10 న రిలీజ్ చేస్తున్నారు. వాయిదా పడుతూనే వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సంక్రాంతికి కానుక రిలీజ్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ అవ్వడానికి తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్స్ ను టీమ్ మొదలెట్టేశారు. గత వారమే డల్లాస్‌లో యూనిట్ సందడి చేసింది. ఇప్పటి వరకు వదిలిన పాటలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా గేమ్ చేంజర్ సినిమాకు ఒక్కరోజు షూటింగ్ కు అయిన ఖర్చు పై పెద్ద చర్చే నడుస్తుంది. అసలు ఒక్కరోజుకు ఎన్ని ఖర్చు చేసారో ఇప్పుడు తెలుసుకుందాం..


డైరెక్టర్ శంకర్ గతంలో చేసిన సినిమాలు భారీ బడ్జెట్ తో, భారీ విజన్ తో వచ్చాయి. ఇక ఆ సినిమాలకు ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఒక్కో సీన్, ఒక్కో షాట్ కోసం కోట్లు ఖర్చు పెడుతుంటాడు. అందులో పాటల విషయంలో శంకర్ మరింత ఫోకస్డ్‌గా ఉంటాడు.. గతంలో ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క.. గేమ్ ఛేంజర్ మూవీలో ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదలయ్యాయి. ఆ పాటల్లో భారీ సెట్ తో పాటుగా మందిని కూడా పెట్టి తీశారు. ‘రా మచ్చా మచ్చా ‘ పాట కోసం 500 మంది డ్యాన్సర్లను దించిన సంగతి తెలిసిందే. వైజాగ్, అమృత్ సర్ వంటి ఏరియాలో ఈ పాటను షూట్ చేశారు.. ఇక ఈ పాట షూటింగ్ పూర్తి అయ్యేలోగా డ్యాన్సర్స్ కు దాదాపు కోటి వరకు ఖర్చు పెట్టారని తెలుస్తుంది.. అసలు ఒక్కో పాట కోసం పదుల కోట్లు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో తెరకెక్కించాడట. పాటలకే ఆడియెన్స్ పెట్టే టికెట్ డబ్బులు సెట్ అవుతాయని తమన్ పదే పదే చెబుతూనే ఉన్నాడు.

అదే విధంగా ఈ మూవీ నుంచి వచ్చిన మొదటి పాట జరగండి పాటకు ఎంత ఖర్చు చేసారో అర్థం చేసుకోవచ్చు.. దాదాపు 8 కోట్లు ఖర్చు చేశారనే వార్తలు వినిపించాయి.. రా మచ్చా మచ్చా, నా నా హైరానా, డోప్ సాంగ్స్ ఇలా అన్నీ కూడా థియేటర్లో బ్లాస్ట్ అవుతాయని, విజువల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటాయని శంకర్, తమన్ అంతా కూడా చెబుతూనే ఉన్నారు.. ఇప్పటికి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ట్రైలర్ ను కూడా రిలీజ్ చెయ్యనున్నారని సమాచారం. ఇక ఆ ట్రైలర్ లోని సినిమా స్టోరీని చెప్పబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అంజలి, కియారా అద్వానీ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. మరి మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×