BigTV English
Advertisement

Kalki 2898 AD – T20 WC 2024: మహాయుద్ధం గెలవటమే అసలైన పరీక్ష.. ‘కల్కి’ అమితాబ్ లుక్‌తో టీమిండియాపై స్పెషల్ వీడియో.. గూస్ బంప్స్ అంతే!

Kalki 2898 AD – T20 WC 2024: మహాయుద్ధం గెలవటమే అసలైన పరీక్ష.. ‘కల్కి’ అమితాబ్ లుక్‌తో టీమిండియాపై స్పెషల్ వీడియో.. గూస్ బంప్స్ అంతే!

Amitabh Bachchan Special video for T20 WC 2024 from Kalki 2898 ad Getup: దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ హైవోల్టేజీ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 ad). ఈ మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందులోనూ ప్రభాస్ మూవీ అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ప్రభాస్ హైట్‌కి.. ఈ మూవీలో ఉండే యాక్షన్‌కి పర్ఫెక్ట్‌గా కుదిరిందని.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోద్దని సినీ ప్రియులు, అభిమానులు ఫిక్స్ అయిపోయారు.


ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ప్రభాస్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్‌తో సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇక ఇటీవలే అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ మరింత ఆసక్తిని రేకెత్తించారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో నెలకొంది.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఎప్పటి కప్పుడు అప్డేట్‌లను పంచుకోవడంలో ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. కొత్త కొత్త సర్ప్రైజ్‌లతో సినీ అభిమానులను ఫుల్ ఖుష్ చేస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసి యావత్ ఇండియన్స్‌లో ఫుల్ ఎనర్జీని అందించారు. ఈ మేరకు కల్కి లుక్‌తో క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశారు.


Also Read: ‘కల్కి 2898 ఏడీ’ కోసం మహేశ్ బాబును కలిసిన దర్శకుడు.. ఇదిమామూలు ట్విస్ట్ కాదు భయ్యా!

ఆ వీడియో ప్రకారం.. ‘కల్కి’లోని అమితాబ్ లుక్‌ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ లుక్‌తో టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయాన్ని సాధించాలని సపోర్ట్ చేసేలా ఓ వీడియో క్రియేట్ చేసి రిలీజ్ చేశారు. అందులో ఓ డైలాగ్ మాత్రం యావత్ ఇండియన్స్‌లో ఫుల్ ఎనర్జీ నింపింది. యుద్ధం రోజు ఉంటుంది.. కానీ మహాయుద్ధం గెలవటమే అసలైన పరీక్ష అని అమితాబ్ చెప్పే వీడియో అద్భుతంగా ఉంది. అందులో విరాట్, రోహిత్, బుమ్రాతో సహా టీ20 టీమిండియా ప్లేయర్స్ కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ ట్రెండింగ్ అవుతుంది.

Also Read: Vikrant Massey: క్యాబ్ డ్రైవర్ తో 12 th ఫెయిల్ హీరో గొడవ.. అసలు నిజం ఇదే.. ?

ఇకపోతే ‘కల్కి’ మూవీలో భారీ తారగణం నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో అదిరిపోయే కీలక పాత్రలు చేయనున్నారు. అంతేకాకుండా ఇందులో మరో ఇద్దరు యంగ్ అండ్ స్టార్ హీరోలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు కూడా ఇందులో భాగం అయినట్లు సమాచారం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×