Big Stories

RCB Vs PBKS Match Preview: ఆర్సీబీ దూకుడు.. నేడు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్!

IPL 2024 58th Match – RCB Vs PBKS Prediction: ఐపీఎల్ 2024 సీజన్ మొదట్లో అపజయాల బాటలో నడిచిన రెండు జట్లు పంజాబ్ కింగ్స్ ఇంకా ఆర్సీబీ ఇప్పుడే పుంజుకున్నాయి. నేడు  హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో రాత్రి 7.30కి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ 8వ స్థానంలో ఉండగా ఆర్సీబీ 7వ స్థానంలో ఉంది. రెండు జట్లు కూడా 11 మ్యాచ్ లు ఆడి, 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి చెరో 8 పాయింట్లు సాధించాయి. అయితే రన్ రేట్ ప్రకారం ఆర్సీబీ ముందంజలో ఉంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 32 మ్యాచ్ లు జరిగాయి. పంజాబ్ 17 సార్లు విజయం సాధించగా, ఆర్సీబీ 15 సార్లు గెలిచింది.

- Advertisement -

ప్రస్తుతం రెండు జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు లేవు. కానీ ఒక దారి ఉంది. అదేమిటంటే వీటిపైన 12 పాయింట్లతో మూడు జట్లు ఉన్నాయి. అవి ఏమైనా వరుసగా ఓడిపోతే మాత్రం.. నేటి మ్యాచ్ లో గెలిచే ఒక జట్టుకి అవకాశం ఉంటుంది.  ఓడిపోయే జట్టుకి మాత్రం.. ఆ ఆఖరి చూపు కూడా ఉండదు, దాదాపు అవకాశాలు మూసుకుపోయినట్టే అని చెప్పాలి.

Also Read: ఆకాశమే హద్దుగా చెలరేగిన హైదరాబాద్.. ఘోర పరాజయాన్ని చూసిన లక్నో

ఆర్సీబీ విషయానికి వస్తే కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కొహ్లీ కాంబినేషన్ అద్భుతంగా నడుస్తోంది. విల్ జాక్స్, రజత్ పటీదార్, కెమెరాన్ గ్రీన్ అందరూ చివర్లో ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడిప్పుడే బ్యాట్ ఝులిపిస్తున్నారు. బౌలింగు పరంగా కూడా బాగుంది. సిరాజ్ పవర్ ప్లే లో వికెట్లు తీస్తున్నాడు. అదే తన బలం.. మళ్లీ పుంజుకున్నాడు.మిగిలిన వాళ్ల సపోర్టు కూడా దొరుకుతోంది.

పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా ఆర్సీబీ తరహాలోనే ఉంది. 261 పరుగల టార్గెట్ ని ఉఫ్ మని ఊదేసిన పంజాబ్ అనూహ్యంగా గత మ్యాచ్ ఓటమి పాలైంది. మరి తిరిగి పుంజుకుంటుందా? ఇక్కడితో ఆగిపోతుందా? అనేది తెలీదు. ఇకపోతే జానీ బెయిర్ స్టో, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, రిలీ రొసోవ్ అందరూ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు. బౌలింగు కూడా సెట్ అయ్యింది.

ప్లే ఆఫ్స్ కి ఆశలను సజీవంగా ఉంచుకునే జట్టు ఏదో నేడు తేలిపోనుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News