BigTV English

Venkatesh Road Show @ Kaikaluru: కైకలూరులో వెంకటేష్ ప్రచారం.. తనదైనశైలిలో సినీ డైలాగ్స్‌తో..

Venkatesh Road Show @ Kaikaluru: కైకలూరులో వెంకటేష్ ప్రచారం.. తనదైనశైలిలో సినీ డైలాగ్స్‌తో..

Victory Venkatesh Road Show at Kaikaluru Road Show: తెలుగురాష్ట్రాల్లో బంధువుల తరపున టాలీవుడ్ నటుడు, హీరో విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాడు. ఇప్పటికే ఖమ్మంలో వియ్యంకుడి తరపున ప్రచారం చేశాడు. అక్కడి ప్రజల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడి నేరుగా ఆంధ్రపదేశ్‌లోని కైకలూరుకి వచ్చారు. అక్కడ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు తరపున ప్రచారం చేశాడు.


ఏలూరు జిల్లా కలిదిండిలో బుధవారం సాయంత్ర రోడ్ షోలో పాల్గొన్న వెంకటేష్, తొలుత చేయి ఊపాడు. ఎన్డీయే ఆఫీసు నుంచి పడమటిపాలెం, ఎస్ఆర్పీ ఆగ్రహారం, సానారుద్రవరం, కోరుకొల్లు మీదగా రోడ్ షో సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల ఉత్సాహం గమనించి మైక్‌ని చేతులోకి తీసుకున్నాడు.

గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటేష్..  శ్రీను మావయ్య మాట ఇస్తే తప్పకుండా నేరవేరుస్తారని చెప్పుకొచ్చాడు. వెంకీ మామగానే కాకుండా, పెళ్లికాని ప్రసాద్‌గా.. అమాయక చంటిగా కోరుతున్నారని వ్యాఖ్యానించారు. కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్జీతో గెలిపించాలని ఓటర్లను కోరాడు. ఈనెల 13న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నాడు.


Also Read: ఏపీలో నోట్ల కట్టలు, అర్థరాత్రి 8 కోట్లు.. మెషిన్లతో కౌంటింగ్

నార్మల్‌గా అయితే వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భాలు లేవు. ఎందుకంటే సాధారణంగా ఆయన బయటకు కనిపించడు. ఎప్పుడో సినీ, మ్యారేజ్ పంక్షన్లకు మాత్రమే దర్శనమిస్తాడు. గతంలో వెంకీ తండ్రి రామానాయుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రచారం చేశాడు. ఆ తర్వాత కైకలూరులో మాత్రమే వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో కనిపించాడు.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×