Sonia Akula:బిగ్ బాస్ (Bigg Boss).. బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో ఎంతోమంది కెరియర్ కు మంచి పునాది వేసింది. ముఖ్యంగా పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క షో తో లభించిందని, ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తెలియజేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ షో ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం.. అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ మాత్రమే కాదు ఆ షో ని ముందుకు నడిపించే హోస్ట్ కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు.. అలా మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హోస్ట్ గా వ్యవహరించి, భారీ సక్సెస్ అందించగా.. రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని (Nani ) హోస్ట్గా వ్యవహరించారు. అయితే ఆయన హోస్టింగ్ లో కాస్త విమర్శలు రావడంతో.. ఇక మూడవ సీజన్ కోసం రంగంలోకి దిగారు నాగార్జున (Nagarjuna). ఇక అప్పటినుంచి దాదాపు 8 సీజన్ ల వరకు నాగార్జున హోస్ట్గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు త్వరలో 9వ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఆయనే చేస్తారా? లేక మరెవరైనా వస్తారా? అనే విషయాలు వైరల్ గా మారాయి.
Star Hero: స్నేహమంటే ఇదేరా… మెగాస్టార్ కోసం మోహన్ లాల్ ఊహించని పని..!
నాగార్జున హోస్టింగ్ పై బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..
ఇలాంటి సమయంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల(Sonia Aakula) నాగార్జున హోస్టింగ్ పై పలు ఆశ్చర్యకర కామెంట్లు చేసింది. సోనియా ఆకుల విషయానికి వస్తే.. ఆర్జీవి స్కూల్ నుండి వచ్చిన ఈమె .. ఆర్జీవి ప్రొడక్షన్ లో ‘ఆశ’, ‘కరోనా’ లాంటి సినిమాలు చేసి0 ఆ తర్వాత కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది. అయితే ఈమెకు ఆ సినిమాలు ఏవీ కూడా గుర్తింపును అందివ్వలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యింది. కానీ ఊహించని పాపులారిటీ లభించింది. ఇకపోతే సోనియా ఆకుల నటిగానే కాకుండా ఒక టూరిజం సంస్థలో కూడా పనిచేస్తోంది. అంతేకాదు ఒక ఎన్జీవో ని కూడా నడిపిస్తోంది .ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ యష్ ను వివాహం చేసుకున్న ఈమె, తాజాగా కీలక పాత్ర పోషించిన ‘ఆర్టిస్ట్’ సినిమా మార్చి 31న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె నాగార్జున హోస్టింగ్ పై కామెంట్లు చేసింది.
బిగ్ బాస్ కి నాగార్జున కంటే ఆయనే బెటర్..
సోనియా ఆకుల మాట్లాడుతూ.. నాకు వ్యక్తిగతంగా బిగ్ బాస్ కి మళ్లీ వెళ్లాలని లేదు. కానీ అదే జనాలకు దగ్గర చేస్తుంది. నేను 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ తోనే లభించింది. అయితే ఈసారి నేను బిగ్ బాస్ కి వెళ్ళాలంటే అక్కడ నాగార్జున సార్ హోస్ట్ గా ఉండొద్దు. ఆయన చాలా సాఫ్ట్ గా ఉంటారు. సరిగ్గా మాట్లాడలేరు. ఎన్నో పదాలు, మాటలు మార్చేశారు. నేను అనని వాటి గురించి కూడా తప్పుగా ప్రమోట్ చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ లో హోస్ట్ పాత్ర చాలా మేజర్ గా ఉంటుంది. కానీ ఆయన మాత్రం చెవిలో ఉండే మైకులో ఏం చెప్తే అదే చెప్తారు చెప్పేముందు ఆలోచించరు. అందుకే నాగార్జున తప్పుకుంటే ఆ స్థానంలో రానా అయితే హోస్టుగా బాగా సరిపోతారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఎన్నో షోలు కూడా చేసి సక్సెస్ అందుకున్నారు” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే నాగార్జున హోస్టింగ్ పై సోనియా ఆకుల చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.