BigTV English
Advertisement

Allu Arjun : పుష్ప రాజ్ అంటే ఆ మాత్రం ఉండాలి.. నీ అవ్వా లెక్క పెరిగినా తగ్గేదేలే..

Allu Arjun : పుష్ప రాజ్ అంటే ఆ మాత్రం ఉండాలి.. నీ అవ్వా లెక్క పెరిగినా తగ్గేదేలే..

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యింది. గత ఏడాది చివరిలో రిలీజ్ అయిన మూవీ వరుస రికార్డులను బ్రేక్ చేసింది.. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో థియేటర్లలోకి వచ్చిన ఏ సినిమా మొదటి రోజు నుంచి సక్సెస్ టాక్ ను అందుకోవడంతో పాటు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. పుష్ప 2 తో పాన్ ఇండియా నెంబర్ 1 సినిమాగా కలెక్షన్స్ తో అదరగొట్టిన అల్లు అర్జున్ రాబోతున్న సినిమాలతో కూడా అదే రేంజ్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడని అర్ధమవుతుంది.. ఈ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే ప్రశ్నలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు? అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం..


పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టిన అల్లు అర్జున్తో సినిమా చేయడానికి బాలీవుడ్ మేకర్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు.. అందులో సంజయ్ లీలా భన్సాలి ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే అల్లు అర్జున్ భన్సాలిని కలిసిన విషయం తెలిసిందే. ఈ కాంబోలో ఒక భారీ సినిమా రాబోతుందని ముంబై మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సౌత్ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ లు బన్నీతో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత సలార్ 2 ఉంటుంది. ఇవి పూర్తయ్యాక అల్లు అర్జున్ తో సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడని నువ్వు వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..

అంతేకాదు టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, రీసెంట్ గా అనిమల్ సినిమాతో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి. సందీప్ వంగ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టిస్తుంది. తప్పకుండా ఈ కాంబో సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. మొత్తానికైతే అల్లు అర్జున్తో టాప్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్స్ అందరూ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ లైనప్ కనుక సెట్ అయితే అల్లు అర్జున్ బాక్సాఫీస్ రచ్చ ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×