Vijay Sethupathi:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈమధ్య తెలుగులో కూడా విలన్ పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు రజనీకాంత్ (Rajinikanth) వంటి సూపర్ స్టార్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ సేతుపతి. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఎంతో కీలకమైన శాశ్వత ఖాతా నెంబర్ (పాన్) కి సంబంధించి కొన్ని మార్పులు చేయాలని విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వానికి తన అభ్యర్థన వినిపించారు. పాన్ కార్డుకు సంబంధించిన సమాచారం అప్డేట్లను తమిళంలో కూడా అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు
కేంద్రాన్ని అభ్యర్థిస్తున్న విజయ్ సేతుపతి..
తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ సేతుపతి మాట్లాడుతూ..పాన్ కార్డు వివరాలు ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఈ భాషలు రాని వారు పాన్ కార్డు అప్డేట్ల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కష్టమైనప్పటికీ కూడా తమిళ భాషను యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటూ కోరారు. పాన్ కార్డు వెబ్సైట్లో తమిళంలో సమాచారం అందుబాటులో ఉంటే, ఇది మరింతమందికి చేరువవుతుందని” తెలిపారు. ఇక ఆయన మాట్లాడుతూ.. “తమిళనాడులోని ప్రజలకు పాన్ కార్డు విషయంలో సమస్యలు ఎదురైనప్పుడు వారు చాలా గందరగోళానికి గురి అవుతున్నారు. అందుకే వారికి అర్థమయ్యే భాషలో ఉంటే సమస్య ఉండద” అంటూ తెలిపారు విజయ్ సేతుపతి.
తమిళ భాషను యాడ్ చేయాలంటున్న విజయ్ సేతుపతి..
భాషతో సంబంధం లేకుండా పౌరులందరికీ అవసరమైన ఆర్థిక సమాచారాన్ని సులభంగా యాక్సిస్ చేసేలా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పాన్ కార్డు, సంబంధిత అప్డేట్లను బహుళ భాషల్లో అందుబాటులో ఉండేలా చూడాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విజయ్ సేతుపతి. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
విజయ్ సేతుపతి సినిమాలు..
విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే.. డబ్బింగ్ చిత్రం ‘విడుదల 2’ సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో సూరి పాత్రలో చాలా అద్భుతంగా నటించాడని చెప్పవచ్చు. దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. మంజు వారియర్ కీ రోల్ పోషించింది. గత ఏడాది విడుదలై మెప్పించిన విడుదల పార్ట్ -1 కి కొనసాగింపుగా ఈ సినిమా వచ్చింది. ఇక తెలుగులో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) , యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi shetty) తొలి పరిచయంలో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలలో విలన్ క్యారెక్టర్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న విజయ్ సేతుపతి తమిళంలో హీరోగా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఏది ఏమైనా విజయ్ సేతుపతి అటు సినిమాల ద్వారానే కాకుండా అటు ప్రజలకు వస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టుకోవడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.