Subhasree Rayaguru : శుభశ్రీ రాయగురు (Subha Sree Rayaguru) అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ బిగ్ బాస్(Bigg Boss) శుభశ్రీ అంటే మాత్రం టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శుభశ్రీ ఈ కార్యక్రమం అనంతరం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఇటీవల శుభశ్రీ పెళ్లి గురించి శుభవార్త తెలియజేయడమే కాకుండా నిశ్చితార్థం(Engagment) చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇటీవలే ఈమె నిశ్చితార్థపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక వీరికి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఇక శుభ శ్రీ అజయ్ మైసూర్ (Ajay Mysore) అలియాస్ ఏజే మైసూర్ అనే వ్యక్తితో ఘనంగా నిశ్చితార్థని జరుపుకున్నారు. ఈయన ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్నారు.ఈయన అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమ్మ రాజ్యంలో కడప రెడ్లు (అమ్మరాజ్యంలో కడప బిడ్డలు), 10th క్లాస్ డైరీస్ వంటి చిత్రాలతో పాటు పలు షార్ట్ ఫిలింస్‌లో నటించారు. అదేవిధంగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేశారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజయ్ శుభశ్రీ ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలే పెళ్లి రేంజ్ లో తమ నిశ్చితార్థాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు.
స్పెషల్ గా డిజైన్ చేయించారా…
ఇలా నిర్మాతతో శుభశ్రీ నిశ్చితార్థం జరుపుకోవడంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అవ్వడమే కాకుండా తనకు కాబోయే భర్తతో కలిసి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శుభశ్రీ తన నిశ్చితార్థపు ఉంగరం గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అజయ్ నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలిపారు. అందులో విలువైన డైమండ్స్ పెట్టడమే కాకుండా వారి ఇద్దరి పేర్లను కూడా డిజైన్ చేయించినట్లు తెలియజేశారు.
21 లగ్జరీ కార్లు…
ఇలా ప్రత్యేకంగా ఎంగేజ్మెంట్ కోసం ఈ రింగ్ డిజైన్ చేయించడంతో ధర కూడా భారీగానే ఉంటుంది కదా అంటూ ప్రశ్న ఎదురవడంతో అజయ్ ఆ రింగ్ ధర చెప్పబోతూ ఉండగా ఒకసారిగా శుభశ్రీ చెప్పకుండా తన నోటికి చేతిని అడ్డుపెట్టింది. ఇలా రింగ్ కాస్ట్ బయటకు చెప్పలేకపోతున్నారు అంటే దాదాపు ఒక కోటి రూపాయలు ఉంటుందా? అంటూ మరో ప్రశ్న ఎదురైంది. కోటి కాదని చెప్పడంతో 50 లక్షలు ఉంటుందా? అని అడగగా అంతకంటే ఎక్కువే ఉంటుందని చెప్పడంతో ఇది కాస్త సంచలనగా మారింది. ఇలా ఎంగేజ్మెంట్ రింగ్ కోసమే కోట్లు ఖర్చు చేశారంటే నిర్మాతగా, నటుడిగా అజయ్ ఏ రేంజ్ లో సంపాదించారో స్పష్టం అవుతుంది. ఇక ఈయన తన గ్యారేజ్లో ఏకంగా 21 లగ్జరీ కార్లను పెట్టారని, తనకు ఏ కారు కీస్ దొరికితే ఆ కారు వేసుకొని తిరుగుతూ ఉంటాను అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో శుభశ్రీ బడా ప్రొడ్యూసర్ ను బానే పట్టేసింది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.