BigTV English
Advertisement

Sudheer Babu: అప్పుడు మంచు మనోజ్, ఇప్పుడు వరుణ్ తేజ్.. యంగ్ హీరోలను టార్గెట్ చేస్తున్న సుధీర్ బాబు

Sudheer Babu: అప్పుడు మంచు మనోజ్, ఇప్పుడు వరుణ్ తేజ్.. యంగ్ హీరోలను టార్గెట్ చేస్తున్న సుధీర్ బాబు

Sudheer Babu: ఈరోజుల్లో సినిమాలను కొత్తగా ప్రమోట్ చేయడం కోసమే మేకర్స్ మరింత ఎక్కువగా కష్టపడుతున్నారు. సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయితే.. అది ప్రేక్షులకు రీచ్ అయ్యేలా చేయడం మరొక ఎత్తు. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రేక్షకులు కొత్తదనం కోరుకోవడం మొదలుపెట్టారు. దీంతో మేకర్స్ కూడా ప్రమోషన్స్ కొత్తగా ఎలా చేయాలా అనే ఆలోచనలో పడ్డాయి. ఇక సుధీర్ బాబు పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉంటుంది. తను హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ప్రమోషన్స్ కోసం యంగ్ హీరోలను టార్గెట్ చేస్తున్నాడు సుధీర్. తాజాగా వరుణ్ తేజ్ కూడా సుధీర్ బాబు ప్లాన్‌లో బలయ్యాడు.


వారికే తెలియకుండా

ఒక తండ్రీ, కొడుకుల అనుబంధంపై తెరకెక్కిన ఎమోషనల్ సినిమానే ‘మా నాన్న సూపర్ హీరో’. అక్టోబర్ 11న ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో ఈ మూవీని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం సుధీర్ బాబు కష్టపడుతున్నారు. ఇప్పటికే పలు షోలకు, ఈవెంట్స్‌కు హాజరయ్యి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయినా ప్రమోషన్స్‌లో ఒక కొత్తదనం కావాలని ఇతర హీరోల చేత కూడా ప్రమోషన్స్ చేయిస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అలా ప్రమోట్ చేసిన విషయం వారికే తెలియదు. ఇప్పటికే మంచు మనోజ్ చేత కూడా ఇలాగే ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాను ప్రమోట్ చేయించిన సుధీర్ బాబు.. ఇప్పుడు వరుణ్ తేజ్‌తో కూడా అదే పని చేయించాడు.


Also Read: కుర్ర హీరో ఏడాది గ్యాప్.. ఆ తప్పును సరిదిద్దికోవడానికే.. ?

ప్రమోషన్ కోసం ఫోటో

తాజాగా వరుణ్ తేజ్.. షూటింగ్‌లో పాల్గొనడం కోసం క్యారవ్యాన్ నుండి బయటికి వచ్చాడు. అలా బయటికి రాగానే అక్కడ ఫోటోగ్రాఫర్లు తనను ఫోటో తీయడం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారి సంతోషం కోసం వారి ఫోటోలకు ఫోజులిస్తాడు వరుణ్ తేజ్. కానీ ఇంతలోనే ఇద్దరు వ్యక్తులు వచ్చి వరుణ్ తేజ్ వెనకాల ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా పోస్టర్ పెడతారు. ఫోటోగ్రాఫర్లు దాన్ని ఫోటో తీస్తారు. ఈ వీడియోను సుధీర్ బాబు తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తన ఐడియాను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇలా కూడా ప్రమోషన్స్ చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు.

కటౌట్‌ను వాడేసుకున్నాం

‘నీ ఆరడుగుల కటౌన్‌ను మా సినిమా కటౌట్‌కు వాడేసుకున్నాం. థాంక్యూ వరుణ్ తేజ్’ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సుధీర్ బాబు. ‘మా నాన్న సూపర్ హీరో’ విషయానికొస్తే.. అభిలాష్ అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయవుతున్నాడు. ఇప్పటికే ‘లూజర్’ అనే వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసి.. ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూలు అందుకున్నాడు అభిలాష్. అంతే కాకుండా తను ప్రశాంత్ నీల్ దగ్గర రైటర్‌గా కూడా పనిచేశాడు. ఇక ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాలో సాయాజీ షిండే, సుధీర్ బాబు తండ్రీకొడుకులుగా కనిపిస్తుండగా సాయి చంద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో సుధీర్‌కు జోడీగా ఆర్నా నటించింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×