చిత్రం : జనక అయితే గనక
విడుదల తేది : 11 అక్టోబర్ 2024
నటీనటులు : సుహాస్, సంగీర్తన, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గోపరాజు రమణ
దర్శకుడు : సందీప్ రెడ్డి బండ్ల
నిర్మాత : దిల్ రాజు
Janaka Aithe Ganaka Movie Rating – 2.25/5
సుహాస్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ ఏడాది అప్పుడే ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ ‘శ్రీరంగనీతులు’ ‘ప్రసన్నవదనం’ ‘గొర్రె పురాణం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరో రెండు రోజుల్లో ‘జనక అయితే గనక’ తో మరోసారి ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా అనిపించాయి. సినిమాపై కొద్దిపాటి అంచనాలు ఏర్పడేలా చేశాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో.. ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
ప్రసాద్(సుహాస్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. ఓ స్థలం విషయంలో.. తన తండ్రికి(గోపరాజు రమణ) సలహా ఇస్తే అది అతని తండ్రి పాటించడు. కట్ చేస్తే.. అతను సజెస్ట్ స్థలం వాల్యూ పెరిగిపోతుంది. అక్కడ ఫ్లాట్స్ ను కోట్లు పెట్టి కొనుగోలు చేస్తుంటారు జనాలు. తన బెస్ట్ డెషిషన్ ను తీసుకోలేని కారణంగా అతని ఫ్యామిలీ మిడిల్ క్లాస్ లెవెల్లోనే ఆగిపోయింది అని ప్రసాద్ భావన. అందువల్ల తనకి పిల్లలు కనుక పుడితే వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లలు వద్దని కూడా తన భార్య(సంగీర్తన)తో చెబుతాడు.అందుకోసమే వాళ్ళు కలుస్తున్నప్పుడు కం*మ్ వాడతాడు. అయినప్పటికీ తన భార్య గర్భం దాల్చడంతో షాక్ కి గురవుతాడు. ఈ క్రమంలో లాయర్ అయినటువంటి అతని ఫ్రెండ్(వెన్నెల కిషోర్) తో సదరు కం*మ్ కంపెనీకి కోర్టు నోటీసులు పంపుతాడు. ఆ తర్వాత ఆ కం*మ్ కంపెనీ వల్ల.. ప్రసాద్ కి, అతని ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ కథ వింటుంటే తెలుగు ప్రేక్షకులకి ‘గోపాల గోపాల’ సినిమా గుర్తుకురావచ్చు. ఇది కూడా కోర్టు డ్రామానే. అక్కడ కూడా కేసు గెలిస్తే కోటి నష్టపరిహారం, ఇక్కడ కూడా కేసు గెలిస్తే కోటి నష్టపరిహారం. కాకపోతే అక్కడ షాప్ గురించి హీరో వాదిస్తే, ఇక్కడ ప్రోడక్ట్ గురించి హీరో వాదిస్తాడు. ‘జనక అయితే గనక’ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్ గా వెళ్తుంది. మొదట్లో బాస్ వల్ల హీరో పడే ఇబ్బందులు ఫన్ క్రియేట్ చేస్తాయి. కానీ ఆ తర్వాత హడావిడిగా మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోయాడు దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల. అందువల్ల తర్వాత ఏ సీన్ వస్తుందో.. ముందే ప్రేక్షకులు గెస్ చేసేస్తూ ఉంటారు. సెకండాఫ్ ఇంట్రెస్టింగ్..గానే మొదలవుతుంది. మురళీ శర్మ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సినిమా వేగం పుంజుకుంటుంది. కానీ క్లైమాక్స్ మళ్ళీ ఫ్లాట్ గా అనిపిస్తుంది. కామెడీ బాగానే ఉన్నా.. ఎందుకో ఫోర్స్డ్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగినట్టు బాగానే ఉన్నాయి. విజయ్ బుల్గానున్ సంగీతం బాగుంది. రెండు పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే.
నటీనటుల విషయానికి వస్తే.. సుహాస్ ఎప్పటిలానే నేచురల్ గా నటించాడు. వెన్నెల కిషోర్, ప్రభాస్ శీను..ల కామెడీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ కోర్టులో చేసే కామెడీకి థియేటర్లో తెగ గోల చేశారు.సాడిస్ట్ బాస్ పాత్రలో పవన్ కుమార్ అల్లూరి బాగా చేశాడు. అతని పాత్ర ఇంకాస్త ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. హీరోయిన్ సంగీర్తన లుక్స్ బాగున్నాయి.బాగా నటించింది కూడా. ఫ్యామిలీ సినిమాలకి, చిన్న సినిమాలకి ఈమె పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకుంది. ‘బలగం’ ఫేమ్ రూప లక్ష్మీ పాత్ర కూడా మెప్పించే విధంగా ఉంది. గోపరాజు రమణ తనకి అలవాటైన మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్లో ఒదిగిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ జడ్జిగా బాగానే సెట్ అయ్యాడు. కానీ అతను హీరోకి ఎందుకు సపోర్ట్ చేస్తాడో అర్ధం కాదు.
ప్లస్ పాయింట్స్ :
కథ
సెకండాఫ్
కామెడీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
సాగదీత
ఫోర్స్డ్ క్లైమాక్స్
మొత్తంగా ఈ ‘జనక అయితే గనక’ టీజర్, ట్రైలర్స్ రేంజ్లో మెప్పించలేదు. కానీ పండుగకి టైం పాస్ కోసం ఈ కోర్టు రూమ్ డ్రామాని ఒకసారి ట్రై చేయొచ్చు.
Janaka Aithe Ganaka Movie Rating – 2.25/5