BigTV English

Simi Garewal: వీడ్కోలు నేస్తమా.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్

Simi Garewal: వీడ్కోలు నేస్తమా.. రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్

Simi Garewal  Heart Wrenching Note About TATA:  భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ఆయన మాజీ ప్రియురాలు, బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్  సంతాపం తెలిపారు. ఆయన మరణం భరించలేనిదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఇక నువ్వు లేవని అంటున్నారు. నీ మరణం భరించలేనిది. వీడ్కోలు నేస్తమా!” అంటూ సిమి ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన బాధను బయటపెట్టుకుంది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “గొప్ప మానవతావాది రతన్ టాటా ప్రేమను పంచుకునే భాగ్యం కలిగినందుకు మీరు చాలా అదృష్టవంతులు” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “టాటా లేకపోవడం వ్యక్తిగతంగా మీకు మాత్రమే కాదు, యావత్ దేశానికి తీరని లోటు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సిని-రతన్ టాటా ప్రేమ కథ  

కొన్ని దశాబ్దాల క్రితం బాలీవుడ్ నటి సిని, ప్రారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ప్రేమలో పడ్డారు. . సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్న రోజుల్లో వీరిద్దరు డేటింగ్ చేశారు. కొంత కాలం తర్వాత కారణాలు బయటకు తెలియకపోయినా, విడిపోయారు. అయినప్పటికీ  మంచి స్నేహితులుగా కొనసాగారు. ఈ విషయాన్ని సిమి స్వయంగా వెల్లడించారు. 2011లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇటర్వ్యూలో టాటాతో తన ప్రేమ గురించి వివరించారు. ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. “ఆయన పరిపూర్ణత, సెన్సాఫ్ హ్యూమర్ నన్ను కట్టిపడేసేవి. ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఆయన అలాగే ఉండేవారు. ఎన్ని సంస్థలు స్థాపించినా, డబ్బు గురించి ఆయన ఏనాడు ఆలోచించలేదు. డబ్బు అనేది తనకు ఎప్పుడూ ముఖ్యం కాదని చెప్పేవారు. దేశానికి, దేశ యువతకు మేలు చేయాలని ఎప్పుడూ భావించేవారు. ఆయన భారత్ లో ఉన్న సమయంలో కంటే విదేశాల్లో చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఇండియాలో ఉంటే క్షణం తీరికలేకుండా గడిపేవారు. ఆయనతో ప్రేమలో ఉన్నా, లేకపోయినా నా దృష్టిలో ఎప్పుడూ ఆయన ఉన్నత స్థాయిలోనే ఉంటారు. ఆయన ప్రేమను పొందే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం” అని సిమి ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పుడే వీరిద్దరి ప్రేమ గురించి బయటకు తెలిసింది.

ఎవరీ సిమి గరేవాల్?  

సిమి గరేవాల్ లుథివేనియాలోని ఓ ఆర్మీ అధికారి కుటుంబలో జన్మించారు. 1962లో ఓ హాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలు చేశారు. బెంగాల్ లోనూ కొన్ని చిత్రాలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న రోజుల్లో రతన్ టాటాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయి, స్నేహితులుగా కొనసాగుతున్నారు.

Read Also: బిజినెస్ కింగ్ టాటా గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇదే.. 69 ఏళ్ల వయస్సులో కూడా.. ?

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×