Big Stories

Sonu Srinivas Gouda Arrested: చిన్నారిని అక్రమంగా దత్తత.. బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్!

Bigg Boss Fame Arrest
Bigg Boss Fame Arrest

Bigg Boss Fame Arrest Sonu Srinivas Gouda Arrested: బిగ్ బాస్ ఓటీటీ కన్నడ సీజన్ 1 ఫేమ్ అరెస్ట్ అయింది. అక్రమంగా ఎనిమిదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న కేసులో సోను శ్రీనివాస్ గౌడను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరుకు చెందిన సోను శ్రీనివాస్ గౌడ చిన్నారిని దత్తత తీసుకునే క్రమంలో సరైన ప్రోసిజర్ పాటించలేదని తేలింది. ఈ క్రమంలో ఆమెపై కర్ణాటక రాష్ట్ర బాలల సంరక్షణ విభాగం అధికారిణి గీత నమోదు చేసిన ఫిర్యాదు మేరకు బెంగుళూరులోని బాదరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి తాజాగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. జేజే చట్టం కింద బాదరహళ్లి పోలీస్ స్టేషన్ లో సోను శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకోవడమే ఆమె అరెస్టుకు కారణం అని స్పష్టం చేశారు. బిగ్ బాస్ లోకి వెళ్లి ఆదరణ సంపాదించిన సోను.. సామాజిక సానుభూతి కోసం చిన్నారికి దత్తత తీసుకుందని, కేవలం పేరు కోసమే ఈ పని చేసిందంటూ ఆమెపై తమకు ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. అంతేకాదు, దత్తత తీసుకోవడంలో ఉండే ప్రక్రియను సోను పాటించలేదని తెలిపారు. ఎలాంటి రూల్స్ పాటించకుండా చిన్నారిని తన తల్లిదండ్రుల నుంచి దత్తత తీసుకుందని అన్నారు.

- Advertisement -

చిన్నారిని దత్తత తీసుకునేందుకు ఆమె తల్లిదండ్రుల అవసరాలు తీర్చిందని, అనేక సౌకర్యాలు కల్పించి అక్రమంగా దత్తత తీసుకున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఈ కారణంతోనే సోనును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఆ చిన్నారితో కలిసి సోను రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తుందని… సమాజానికి తాను గొప్పగా ఉండాలని అనుకునేందుకు ఓ చిన్నారిని అడ్డుపెట్టుకుందని ఆరోపణలు కూడా వచ్చాయి. దత్తత ప్రక్రియలో కొన్ని కీలక అంశాలు కూడా ఉంటాయని పోలీసులు అన్నారు. దత్తత తీసుకునే వ్యక్తికి చిన్నారికి మధ్య 25 ఏళ్ల వయసు తేడా ఉండాలని అన్నారు. కానీ సోను దత్తత తీసుకున్న చిన్నారికి తనకు మధ్య అసలు అంత తేడా లేదని గుర్తించారు. మరోవైపు దత్తత ప్రక్రియలో కొన్ని పనులు చేయకూడదని కూడా తెలిపారు. దత్తత తీసుకున్న చిన్నారుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని పోలీసులు అన్నారు. అయితే సోను మాత్రం ఆ చిన్నారితో కలిసి ఫోటోలు, వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్లు చెప్పారు. పేరు, ప్రఖ్యాతల కోసం సోను శ్రీనివాస్ గౌడ్ ఈ పని చేసిందని తమకు అందిన సమాచారం(ఫిర్యాదులు) మేరకే అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: TDP Workshop Candidates:ఛాన్స్ ఇవ్వొద్దు.. వదలొద్దు.. అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు

ఈ ఘటనపై సోను శ్రీనివాస్ గౌడ కూడా స్పందించారు. ఎనిమిదేళ్ల చిన్నారిని తాను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అయితే దత్తత తీసుకునే క్రమంలో అన్ని నియమాలు పాటించినట్లు చెప్పారు. అంతేకాకుండా చిన్నారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపాకే తాను ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చారు. ‘ఒక రోజు చిన్నారికి మా అపార్ట్మెంట్ కింద ఒంటరిగా ఉండడం చూశారు. అప్పుడు నేను తన దగ్గరకు వెళ్లి చాక్లెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ చిన్నారి తన ఇంటికి తీసుకెళ్లమని అడగడంతో ఇంటికి వెళ్లాను. అలాగే ఆ చిన్నారికి దత్తతకు ముందే చైన్ కూడా ఇచ్చాను. వాళ్ల తల్లిదండ్రులను సంప్రదించాక.. వారి అంగీకారంతోనే చిన్నారిని దత్తత తీసుకున్నాను. దీనికి సంబంధించిన వీడియోను కూడా నా యూబ్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాను. నేను చట్టబద్దంగానే దత్తత తీసుకున్నా. దత్తతకు కనీసం 3 నెలలు అయినా సమయం పడుతుంది. అన్ని వివరాలు తెలుసుకున్నాకే నేను ఈ పని చేశాను. ఇంకా చట్టపరంగా పోరాడుతాను’ అని సోను చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News