E-Paper
Advertisement

Prasanna Vadanam 2nd Song: సుహాస్ ‘ప్రసన్నవదనం’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

Prasanna Vadanam 2nd Song: సుహాస్ ‘ప్రసన్నవదనం’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్
Advertisement

Second Single Released from Suhas Prasanna Vadanam Movie: సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ అందరి దృష్టిలో పడిన నటుడు సుహాస్.. ఇప్పుడు ఏకంగా హీరోగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుహాస్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానుల్ని బాగా అలరించాడు.

రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలతో ఫుల్ క్రేజీ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల శ్రీరంగనీతులు సినిమాతో వచ్చి మరింతమందిని ఆకట్టుకున్నాడు. అయితే ఎప్పుడూ కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్న సుహాస్.. ఇప్పుడు మరొక డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దయ్యాడు.

Advertisement

ఇందులో భాగంగానే అర్జున్ దర్శకత్వంలో ‘ప్రసన్నవదనం’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. ఇటీవల టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఈ టీజర్ ప్రకారం.. ఈ మూవీ కూడా సుహాస్ మంచి హిట్‌ను అందించేలా ఉన్నట్లు కనిపించింది.

Also Read: వింత రోగంతో హీరో సుహాస్.. ‘ప్రసన్నవదనం’ టీజర్ రిలీజ్!

Advertisement

ఇందులో కూడా సుహాస్ ఉరుకులు, పరుగులతో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ టీజర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే మేకర్స్ ఇప్పుడు మరొక అప్డేట్‌ను అందించారు. ఈ మేరకు ఈ మూవీలోని సెకండ్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘పో.. పో..’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది. ఇందులో హీరోయిన్‌తో చాటింగ్‌తో ఫుల్ బిజీ అయినట్లు కనిపిస్తుంది. మొత్తంగా సాంగ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది.

లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కుతుంది. మణికంఠ, ప్రసాద్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సుహాస్‌కు జోడీగా పాయల్ రాధాకృష్ణ, రాశిసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేతతో పాటు మరికొంత మంది నటీ నటులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×