BigTV English

Health Tips: మొటిమలకు చెక్ పెట్టండిలా..

Health Tips: మొటిమలకు చెక్ పెట్టండిలా..

Tips For Reduce Acne: ముఖంపై మొటిమలు వస్తే చాలు ప్రతి ఒక్కరూ కంగారు పడుతుంటారు. అమ్మాయిలు అయితే మరీ ఎక్కువనే చెప్పాలి. ముఖంపై వచ్చిన పింపుల్స్ తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ, మొటిమలు రావడానికి గల కారణాలు తెలుసుకొని, వాటిని నివారించగలిగితే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.


ఆయిల్ స్కిన్ ఉండే వారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజుకు నాలుగైదు సార్లు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఉదయం,సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడుక్కుంటే మొటిమల తీవ్రత తగ్గుతుంది. మనం తినే ఆహార పదార్థాలు కూడా మన చర్మంపై ప్రభావం చూపిస్తాయి. నూనె వంటకాలు మొటిమలు రావడానికి కారణమవుతాయి. అందుకే డైట్ లో నూనె శాతం తగ్గించాలి. నీరు తగినంత తీసుకోవాలి.

ALSO READ :చక్కని ఆరోగ్యం కోసం ఇలా చేయండి..


ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. ఫుడ్ విషయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల లివర్‌లో ఉత్పత్తి అయ్యే యాసిడ్లు పింపుల్స్‌కి దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నవారికి సైతం మొటిమలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనల్లో వెల్లడయింది. కాబట్టి మానసికంగా సంతోషంగా ఉండాలి. కొందరు మొటిమలు వస్తే చాలు గిల్లడం ప్రారంభిస్తారు. దీంతో ఇన్ఫెక్షన్‌ పెరగడమే కాకుండా ఆ ప్రాంతంలో చర్మంపై గుల్లలు ఏర్పడతాయి. అందుకే మొటిమలను ఎప్పుడూ గిల్లకూడదు.

పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఆహారంలో భాగంగా చేసుకోవాలి​. డైరీ ప్రోడక్ట్స్​, స్వీట్స్​, చాక్లెట్స్, జంక్​ ఫుడ్​ వంటి ఆహారాలకు దూరంగా ఉంటే మంచింది. రోజూ సమయానికి నిద్రపోవాలి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ప్రయత్నించాలి. ఇలాంటి సింపుల్ చిట్కాలతో మొటిమలను తగ్గించుకోవచ్చు.

Tags

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×