BigTV English

Sukumar : సుకుమార్‌ను చూసి సిగ్గుపడ్డ ఐటెం గర్ల్.. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తాడా అని..

Sukumar : సుకుమార్‌ను చూసి సిగ్గుపడ్డ ఐటెం గర్ల్.. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తాడా అని..

Sukumar: బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. గ్రామరల్స్ రోల్స్, బోల్డ్ లుక్స్ తో స్పెషల్ సాంగ్స్ తో తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ మూవీస్ లోనూ,వెబ్ సిరీస్ లలో నటిస్తూ అడపాదడపా తెలుగులో ఛాన్సులు కొట్టేస్తున్న ఈ అమ్మడు.. ఐపీఎల్ మ్యాచ్ లో గ్యాలరీలో బాలయ్య బాబు పాటకి డాన్స్ చేస్తుండగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనను చూసిన దర్శకుడు ఆమెకు అవకాశాలు ఇస్తాడా లేదా అని ఆమె అనుకుంటుంది. అసలు అమ్మడు ఏ పాటకి డాన్స్ చేస్తుంది.. ఏ దర్శకుడుని గురించి ఆమె అనుకుంటుంది. అక్కడ అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


స్టేడియం లో వింత ఘటన ..

బాలీవుడ్ నటి ఊర్వసి రౌతేలా తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో డాకు మహారాజ్ సినిమాలో, దబిడి దిబిడే సాంగ్ కి స్టెప్పులేస్తుండగా.. ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి అమ్మడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. బలవంతంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ చూడడానికి ఊర్వసీ దుబాయ్ వెళ్లారు. అక్కడ స్టేడియంలో సంబరాలలో ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి, ఆమెని ముద్దు పెట్టుకోగానే ఆమె బలవంతంగా పక్కకి రావడానికి చూసింది. ఈ చర్యకు ఆమె చాలా ఇబ్బంది పడినట్టు ఆ వీడియో చుసిన వారికీ అర్ధం అవుతుంది. ఆ తర్వాత అతనితో కలిసి ఫోటో దిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తరువాత సుకుమార్ ఆమెకి ఛాన్స్ ఇస్తాడా లేదా అని, ముద్దుగుమ్మ వర్రీ అవుతున్నది. సుకుమార్ నెక్స్ట్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో ఈ ముద్దుగుమ్మని తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. మరి వీడియో చూసిన తర్వాత సుకుమార్ నన్ను తన సినిమాలో ఇప్పుడు తీసుకోకపోవచ్చు అని ఆమె అనుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇబ్బందిగా వుందా, అలా నటిస్తున్నారా అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


సినిమా కెరియర్ ..

సినిమా విషయాలకి వస్తే, ఊర్వసి తెలుగులో సంపత్ నందితో బ్లాక్ రోజ్ అనే మూవీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య లో వెల్కమ్ బాస్ పార్టీ పాటతో గుర్తింపు తెచ్చుకున్నారు.పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలోనూ నటించారు. ఆ తర్వాత రామ్ స్కంద సినిమాలోని ఓ సాంగ్ తో అలరించారు. తాజాగా డాకు మహారాజులో దబిడి దిబిడే సాంగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ పాటలోని  బాలయ్య బాబు తో కలిసి వేసిన కొన్నిస్టెప్స్ పై వివాదం చెలరేగింది. ఏది ఏమైనా ఈ అమ్మడు,హిందీ లో, తెలుగులోనూ మంచి ఆఫర్లతో మన ముందుకు రావాలని కోరుకుందాం.

Ram Charan : పెద్ది టీజర్ లో చరణ్ క్యారెక్టర్ పై రచ్చ డైరెక్టర్ కామెంట్స్… ఇలా అన్నాడేంటి..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×