Ram Charan : ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తర్వాత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 15 సినిమాలతోనే గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు అంటే ఈ విజయం వెనుక ఆయన కష్టం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి చిరుత అనే సినిమా ద్వారా అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమా సమయంలో తండ్రి కారణంగానే విజయం సాధించారని చాలామంది అన్నారు. అంతే కాదు ఇతడు హీరో మెటీరియల్ యేనా అని హేళన చేసిన వారు కూడా ఉన్నారు. ఇక వాటన్నింటినీ తట్టుకొని నేడు తానేంటో నిరూపిస్తున్నారు రామ్ చరణ్. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.
రామ్ చరణ్ అలాంటివాడు – సంపత్ నంది
ఇక ఆ తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాతో కాస్త వెనకడుగు వేసినా.. ఇప్పుడు మళ్లీ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుకుమార్ రైటింగ్స్ లో భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పెద్ది సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దీనికి తోడు ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ షాట్ లో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి అటు సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ షాట్ పై రాంచరణ్ తో రచ్చ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సంపత్ నంది కామెంట్ చేయడం వైరల్ గా మారింది.
పెద్ది షాట్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ పై రచ్చ డైరెక్టర్ కామెంట్.
అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్ గా ఓదెలా 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టిన డైరెక్టర్ సంపత్ నంది.. రాంచరణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఒక లయన్. రచ్చ సినిమా టైంలో ఎలా ఉన్నారో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత అలాగే ఉన్నారు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ముఖ్యంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆయన చాలా కామన్ గానే ఉంటాడు. గ్లోబల్ స్టార్ అనే హుందాతనం ఎప్పుడూ కూడా చూపించడు. ముఖ్యంగా ఆయన లయన్ లా ఉండడానికి కారణం ఆయన పుట్టుకతోనే వచ్చింది. మాట్లాడేటప్పుడు కూడా ఆ రాజసం ఉట్టిపడుతుంది. ఆయన ఎంత గొప్ప స్టార్ అయినా సరే మన అందరి ముందు ఒక సామాన్య వ్యక్తి మాత్రమే. ఇక పెద్దిలో ఆ షాట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా వావ్ అనిపిస్తుంది. అంటూ రాంచరణ్ క్యారెక్టర్ పై డైరెక్టర్ సంపత్ నంది చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా సంపత్ నంది లాంటి డైరెక్టర్ రామ్ చరణ్ క్యారెక్టర్జేషన్ పై కామెంట్లు చేయడంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Ram Charan Peddi : ‘పెద్ది’ హిందీ టీజర్ చూశారా? ఆ వాయిస్ ఎవరిదో గమనించారా?