OTT Movie : రొమాంటిక్ సినిమాలు ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తాయి. అందుకనే వీటికి అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో రొమాంటిక్ తో పాటు కామెడీ కూడా దంచి కొడుతుంది. వైవాహిక జీవితంలో ఒంటరిగా ఉన్న ఒక జంట డేటింగ్ కు వెళ్లడంతో మూవీ మొదలవుతుంది. చివరి వరకు ఈ మూవీ కామెడీ తో కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో సినిమా (Jio Cinema) లో
ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘బ్లెండెడ్’ (Blended). 2014 లో వచ్చిన ఈ మూవీకి ఫ్రాంక్ కొరాసి డైరెక్ట్ చేశారు. ఇందులో ఆడమ్ సాండ్లర్, డ్రూ బారీమోర్ ప్రధాన పాత్రల్లో నటించారు.దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ ఇందులో అతిధి పాత్రలో కనిపిస్తాడు. ఈ మూవీ ఇద్దరు సింగిల్ పేరెంట్స్ అయిన జిమ్ (ఆడమ్ సాండ్లర్), లారెన్ (డ్రూ బారీమోర్) చుట్టూ తిరుగుతుంది. వీరు బ్లైండ్ డేట్‌కు వెళ్లిన తర్వాత ఒకరినొకరు మళ్లీ చూడకూడదని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆడమ్ సాండ్లర్, జాక్ గియారాపుటో, మైక్ కర్జ్ నిర్మించారు. మే 23, 2014న ఈ మూవీ విడుదలైంది. ఇది $40 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా $128 మిలియన్లు వసూలు చేసింది. విమర్శకుల నుండి ప్రశంసలను కూడా అందుకుంది. ది వెడ్డింగ్ సింగర్, 50 ఫస్ట్ డేట్స్ తర్వాత సాండ్లర్, బారీమోర్ మధ్య తెరకెక్కిన మూడవ చిత్రం ఈ ‘బ్లెండెడ్’. ఈ మూవీ జియో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
జిమ్ తన భార్యను కోల్పోయి ముగ్గురు కుమార్తెలతో జీవిస్తుంటాడు. మరోవైపు లారెన్ అనే మహిళ భర్తతో విడాకులు తీసుకుని తన ఇద్దరు కుమారులతో ఉంటుంది. జిమ్, లారెన్ మధ్య పరిచయం ఏర్పడి డేట్ కి వెళ్లాలనుకుంటారు. అలా వీరిద్దరూ ఒక బ్లైండ్ డేట్ కి కలసి వెళతారు. లారెన్ ప్రవర్తన వల్ల, అది వీళ్లిద్దరికి చేదు జ్ఞాపకంగా ముగుస్తుంది. ఆ తర్వాత, వారు ఒకరినొకరు మళ్లీ చూడకూడదని భావిస్తారు. కానీ అనుకోకుండా వారిద్దరూ తమ పిల్లలతో కలిసి ఆఫ్రికాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో సెలవులు గడపడానికి వెళతారు. ఒకరిని ఒకరు చూసుకుని ఖంగు తింటారు. అక్కడ జిమ్, లారెన్ మొదట్లో ఒకరితో ఒకరు తగాదాలు పడుతూ, తమ పిల్లలను కలిసి చూసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారి పిల్లలు ఒకరికొకరు సన్నిహితంగా మారుతారు. జిమ్, లారెన్ కూడా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. జిమ్ తన కుమార్తెలకు తల్లి లేని లోటును భర్తీ చేయడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో లారెన్ తన కుమారులకు తండ్రి లాంటి ఫిగర్ అవసరమని గ్రహిస్తుంది.సెలవుల సమయంలో జరిగే సంఘటనలు, సాహసాలు, భావోద్వేగ క్షణాల మధ్య, జిమ్, లారెన్ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. వారు తమ కుటుంబాలను కలిపి సంతోషంగా జీవించాలని నిర్ణయించుకుంటారు. చివరికి ఇరుకుటుంబాలు కలసి సంతోషంగా ఉంటారా ? ఈ స్టోరీకి ఒక మంచి ముగింపు వస్తుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ మూవీని చూడండి.