BigTV English

Sumanth: హిట్ సినిమా వదులుకున్న అక్కినేని హీరో.. చేసి ఉంటేనా.. ?

Sumanth: హిట్ సినిమా వదులుకున్న అక్కినేని హీరో.. చేసి ఉంటేనా.. ?

Sumanth:అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ప్రేమకథ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు సుమంత్ అక్కినేని. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సుమంత్.. ఆ తరువాత ఎన్నో మంచి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడంటే సుమంత్ కు హిట్స్ లేక.. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు కానీ, ఒకప్పుడు సుమంత్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం. అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు.


తాజాగా సుమంత్ ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి, తాను వదులుకున్న సినిమాల గురించి మాట్లాడాడు. ఎందుకు ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు అన్న ప్రశ్నకు సుమంత్ మాట్లాడుతూ.. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవాలి అని అనుకోవడం లేదు. స్క్రిప్ట్ బాగా నచ్చితేనే సినిమా ఒప్పుకుంటున్నాను. అందుకే సినిమాలకు గ్యాప్ వస్తుంది అని చెప్పుకొచ్చాడు.

ఇక తన సినీ కెరీర్ లో ఒక మంచి సినిమాను వదులుకొని బాధపడిన సందర్భం ఉందని సుమంత్ తెలిపాడు.నువ్వే కావాలి కథ మొదట తన వద్దకే వచ్చిందని, తాను వద్దు అనడంతో తరుణ్ వద్దకు వెళ్లిందని తెలిపాడు.


” నా కెరీర్ ను మొదలుపెట్టిన కొత్తలో స్రవంతి రవికిశోర్.. నాకు నువ్వే కావాలి కథను చెప్పారు. అప్పుడు నేను యువకుడు, పెళ్లి సంబంధం సినిమాలు చేస్తున్నాను. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ సినిమాను నేను చేయలేకపోయాను. నా సినీ కెరీర్ లో అవకాశం వచ్చినా.. చేయలేని సినిమా అదొక్కటే” అని చెప్పుకొచ్చాడు.

ఇక సుమంత్ తరువాత ఈ కథ తరుణ్ వద్దకు వెళ్ళింది. తరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నువ్వే కావాలి నిలిచింది. ఒకవేళ సుమంత్ కనుక ఆ సినిమా చేసి ఉంటే .. అతని కెరీర్ వేరేలా ఉండేది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×