Summer Movies : రీ రిలీజ్ చిత్రాల హవా ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే.. నేరుగా వచ్చే సినిమాల కంటే కూడా ఈ రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. దీనికి కారణం.. ఒకరకంగా చెప్పాలి అంటే మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులే. ఎందుకంటే గత మూడేళ్ల క్రితం మహేష్ బాబు నుంచి ఒక సినిమా కూడా రాకపోవడంతో తమ అభిమాన హీరోని థియేటర్లలో చూడడానికి ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు ఆయన సినీ కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ‘పోకిరి’ సినిమాను రీ రిలీజ్ చేసి, వారు ఆనందం పొందడమే కాకుండా అటు నిర్మాతలకు కూడా మంచి ఆదాయాన్ని అందించారు.
ఇక అప్పటినుంచి స్టార్ హీరోల అభిమానులు అందరూ కూడా.. తమ తమ అభిమాన హీరో సినిమాలు లేకపోయినా.. ఆ హీరోలకు సంబంధించిన స్పెషల్ అకేషన్ ఏదైనా ఉన్నా సరే వారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఆనందం పొందుతూ.. అటు నిర్మాతలకు కూడా భారీ లాభాన్ని చేకూరుస్తున్నారు.
రీ రిలీజ్ చిత్రాలతో నిర్మాతలకు భారీ లాభం..
ఇదంతా ఇలా ఉండగా.. సాధారణంగా సమ్మర్ వచ్చింది అంటే ఈ సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి చిన్న హీరోలను మొదలుకొని పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ సినిమాతో రంగంలోకి దిగుతారు. కానీ ఈ సమ్మర్ మాత్రం పూర్తి భిన్నంగా మారిపోయింది. ఏప్రిల్ నెల ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే రీ రిలీజ్ సినిమాలు సంఖ్య పెరిగిపోయిందనే చెప్పాలి. ఈ ఏప్రిల్ నెలలో నేరుగా విడుదలయ్యే సినిమాలు ఐదు ఉంటే.. అందులో తమన్నా (Tamannaah )’ఓదెల 2′, అనుష్క శెట్టి (Anushka Shetty)’ ఘాటీ’, హీరో ప్రియదర్శి(Priyadarshi) ‘సారంగపాణి జాతకం’ తో పాటు మరో రెండు చిత్రాలు ఉన్నాయి.
ఇక మరోవైపు రీ రిలీజ్ అవుతున్న సినిమాలు మాత్రం 10 ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకి ఎంత డిమాండ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే రీ రిలీజ్ చిత్రాలతోనే నిర్మాతలు భారీగా లాభపడుతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నేరుగా విడుదలయ్యే చిత్రాల కంటే ఇప్పుడు రీ రిలీజ్ చిత్రాలతోనే నిర్మాతలు మరింత లాభ పడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఒక సినిమా చేసి విడుదల చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా సినిమా హిట్ అయితే నిర్మాతలకు లాభం వస్తుంది.
ఒకవేళ డిజాస్టర్ అయితే అప్పుల్లో కూరుకు పోవాల్సిన పరిస్థితి. అదే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తే నష్టం ఉండదు. వచ్చేది అంతా లాభమే. కాబట్టి ఇప్పుడు నేరుగా విడుదల చేసే సినిమాల కంటే కూడా ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. దీన్ని బట్టి చూస్తే రీ రిలీజ్ చిత్రాల వల్ల లాభాలే తప్ప నష్టాలు ఉండవని స్పష్టం అవుతుంది. ఇక ఇప్పటినుంచి ఇంక ఎన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతాయో చూడాలి.
రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న సినిమాలు..
ఇదిలా ఉండగా.. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna ) హీరోగా నటించిన టైం ట్రావెల్ మూవీ ‘ఆదిత్య 369 ‘ ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ లో రిలీజ్ చేసి మంచి విజయాన్ని మళ్లీ సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఈ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద టైం మిషన్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సినిమాతో పాటు 2018లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాని కూడా ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు- రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎమ్ బి 29 సినిమా రాబోతోంది.
ఈ సినిమా విడుదల కావడానికి సుమారుగా రెండు నుండి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో మహేష్ బాబు నుండి ఇంకో సినిమా రాదు కాబట్టి ఆయన సినిమాలన్నీ కూడా మళ్లీ థియేటర్లలో ఇంకోసారి పడేలా కనిపిస్తున్నాయి. ఇక దీనికి తోడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన ‘ ఫలక్నుమా దాస్ ‘ సినిమా కూడా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.. ఈ మేరకు చిత్ర బృందం ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేస్తూ..” గేట్ రెడీ ఫర్ మాస్ రైడ్ ” అంటూ అభిమానులలో ఊరట రేకెత్తిస్తోంది. ఒక వీటితోపాటు మరికొన్ని చిత్రాలు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
ALSO READ:Sowmya Rao: హైపర్ ఆదిపై జబర్దస్త్ యాంకర్ ఊహించని కామెంట్..కొత్తవాళ్లు కనిపిస్తే అదే తంతు..!