Jaiswal – Rahane: దిలీప్ ట్రోఫీలో భాగంగా 2022 లో సౌత్ జోన్ తో ముగిసిన ఫైనల్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకున్న ముంబై యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్.. చివరి రోజు తన దురుసు ప్రవర్తనతో విమర్శల పాలయ్యాడు. సౌత్ జోన్ బ్యాటర్ రవితేజని పదేపదే కవ్విస్తూ హద్దులు మీరాడు. అప్పటికే కెప్టెన్ రెండుసార్లు హెచ్చరించినా వినకుండా స్లెడ్జింగ్ చేయడంతో ఎంపైర్లు.. జైశ్వాల్ ని గ్రౌండ్ నుండి వెళ్లిపొమ్మని తేల్చి చెప్పారు.
Also Read: Rohit Sharma: వివాదంలో రోహిత్ శర్మ… ముంబైని నిండా ముంచేలా ఉన్నాడే..?
దీంతో అజంక్య రహానే అతడిని ఫీల్డ్ నుండి వెళ్ళగొట్టాడు. రవితేజని యశస్వి జైష్వాల్ పదేపదే కవ్వించడంతో అతడు రహానికి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ అతడు హద్దులు మీరడంతో ఇక అంపైర్ కి ఫిర్యాదు చేశాడు. అనంతరం క్రమశిక్షణ చర్యలకు దిగిన ఎంపైర్లు.. జైశ్వాల్ ని గ్రౌండ్ నుండి పంపించాలని రాహానే కి సూచించారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో.. ముంబై ఐదు వికెట్ల తేడాతో ఓటమి చెందింది.
దీంతో కెప్టెన్ రహానే, ముంబై కోచ్ ఓంకార్ సాల్వి.. ఓపెనర్ యశస్వి కమిట్మెంట్ ని ప్రశ్నించారు. ఆ తరువాత ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా యశస్వి జైష్వాల్ కి కోపం తెప్పించింది. ఇక అందరూ తనను టార్గెట్ చేస్తున్నట్లు భావించాడు యశస్వి జైస్వాల్. ఈ క్రమంలో అజంక్య రహానే కిట్ బ్యాగ్ ని కూడా అసహనంతో తన్నినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
రంజీ ట్రోఫీ లోను తనని లక్ష్యంగా చేసుకోవడంతో మనస్థాపానికి గురైన యశస్వి జైష్వాల్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో వచ్చే సీజన్ లో కొత్త జట్టుకు ఆడబోతున్నాడు. ఇన్నాళ్లుగా తాను ప్రతినిత్యం వహించిన ముంబై నీ వీడి.. గోవా జట్టుతో జతకట్టబోతున్నాడు. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వెలువడగా.. జైశ్వాల్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వీటిని నిర్ధారించాడు.
Also Read: Venkatesh Iyer: 300 లేదు బొక్క లేదు… SRH పరువు తీసిన వెంకటేష్ అయ్యర్ ?
ఈ నిర్ణయం పై యశస్వి జైష్వాల్ మాట్లాడుతూ.. ” నేను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం ముంబై. ఈ మహానగరం నాకు ఓ గుర్తింపును వచ్చేలా చేసింది. నా జీవితాంతం ముంబై క్రికెట్ అసోసియేషన్ కి రుణపడి ఉంటాను. కానీ గోవా అసోసియేషన్ నాకు కొత్త అవకాశం కల్పిస్తామని చెప్పింది. గోవా జట్టుకు కెప్టెన్ గా నాకు ఆఫర్ ఇచ్చింది. నేను ఏ జట్టుకు ఆడుతున్నా.. టీమిండియా తరుపున గొప్పగా రాణించడమే నా లక్ష్యం. జాతీయ జట్టు విధుల్లో లేనప్పుడు మాత్రం తప్పక దేశీ క్రికెట్ ఆడతా. నా కెరియర్ లో నాకు వచ్చిన ముఖ్యమైన అవకాశాలలో ఇది ఒకటి” అని పేర్కొన్నాడు యశస్వి జైష్వాల్.