BigTV English

QG – Gang War Trailer: దండుపాళ్యం కన్నా ఘోరంగా ఉన్నారేంట్రా.. వణికించేశారు

QG – Gang War Trailer: దండుపాళ్యం కన్నా ఘోరంగా ఉన్నారేంట్రా.. వణికించేశారు

QG – Gang War Trailer: బాలీవుడ్ హాట్ బ్యూటీ  సన్నీ లియోన్, ప్రియమణి, జాకీష్రాఫ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం క్యూజీ- గ్యాంగ్ వార్. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ శ్రీను, ఫిల్మ్ నటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఆగష్టు 30 న క్యూజీ- గ్యాంగ్ వార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశారు. అసలు చూడడానికే భయపడేలా ఉంది. 

మహిళల గ్యాంగ్ చేసే హత్యలు.. ముఖ్యంగా ప్రియమణి చంపే విధానం అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి.. అన్ని భాషల్లోని నటులను తీసుకున్న విధానం ఆకట్టుకుంటుంది.  అసలు ఈ గ్యాంగ్ ఎవరు.. ? ఎందుకు మనుషులను అంత క్రూరంగా చంపుతున్నారు..? వారికి జరిగిన అన్యాయం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 


ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. దండుపాళ్యం గుర్తు రాకమానదు. హాట్ బ్యూటీ సన్నీ లియోన్ డీ గ్లామర్ గా కనిపించింది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో  ప్రేక్షకులకు దగ్గరైన సారా అర్జున్ కూడా ఇందులో మరింత హాట్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. మరి ఈ సినిమాతో ఈ గ్యాంగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×