బాలీవుడ్ తార సన్నీలియోన్‌కి ఎట్టకేలకు ఓ కోర్టు కేసు నుంచి ఊరట లభించింది. అసలు సన్నీలియోన్‌పై కేసు ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? అసలేమైంది? అనే వివరాల్లోకి వెళితే, కేరళలో ఓ ఈవెంట్‌లో పాల్గొంటానని చెప్పి సన్నీలియోన్ తన వద్ద డబ్బులు తీసుకుందని ఈవెంట్ మేనేజర్ శియాస్ కోర్టులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త, మేనేజర్‌లను కూడా ఇందులో దోషులుగా పేర్కొన్నారు. దీనిపై కేరళ డీజీపీ సన్నీలియోన్ దగ్గర వాంగుల్మం కూడా తీసుకున్నారు. ఈ ఘటనపై సన్నీలియోన్ తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కింది. కేసు పూర్వాపలాలను పరిశీలించిన కేరళ హైకోర్టు స్టే విధించింది. కోర్టు అనుమతి లేకుండా తదుపరి చర్యలేవీ తీసుకోవద్దంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది.
2016లో ఓ ఈవెంట్‌లో పాల్గొంటానని చెప్పి శియాస్ దగ్గర సన్నీలియోన్ రూ.29 లక్షలు తీసుకుందనేది కేసు. అయితే పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగూల్మంలో ఆర్గనైజర్ అబద్దం చెబుతున్నాడని, ఈవెంట్ డేట్స్ సరిగ్గా చెప్పకపోవటం వల్ల తను కార్యక్రమాల షెడ్యూల్స్‌ను మార్చుకోవాల్సి వచ్చిందని, ఇవ్వాల్సిన డబ్బులను కూడా టైమ్‌కి ఇవ్వలేదని ఆమె అన్నారు. మరిప్పుడు ఈ కేసు ఏమవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.