E-Paper
Advertisement

Super Star Krishna : సూపర్​స్టార్ కృష్ణ ఇక లేరు..

Super Star Krishna : సూపర్​స్టార్ కృష్ణ ఇక లేరు..
Advertisement

Super Star Krishna : సూపర్​స్టార్ కృష్ణ ఇక లేరు. టాలీవుడ్​ జేమ్స్​ బాండ్ కృష్ణ వయసు రీత్యా, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు చిత్రసీమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి, టాలీవుడ్​ జేమ్స్​ బాండ్ సూపర్​స్టార్ కృష్ణ వయసు రీత్యా, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కృష్ణ కటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే ఉంటున్న కృష్ణ ఆదివారం ఆర్ధరాత్రి 2 గంటల సమయంలో శ్వాసకోస సమస్యతో ఇబ్బంది పడ్డారు. అలానే ఆయనకు స్వల్ప గుండెపోటు కూడా వచ్చింది. దీంతో హుటాహుటిన మహేశ్​బాబు భార్య నమ్రత.. కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయన్ను ఎమర్జెన్సీ అవార్డుకు తరలించి సీపీఆర్​ నిర్వహించారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.ఆ తర్వాత వైద్యులు ప్రెస్​మీట్​ పెట్టి కృష్ణ హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని స్పష్టత ఇచ్చారు.

శరీరంలో కూడా చలనం లేదని తేల్చిచెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, సినీప్రముఖులు ఆందోళన చెందారు. కృష్ణ కోలుకోవాలని ప్రార్థించారు. వైద్యులు కూడా ఎంతగానో ఆయన్ను కాపాడేందుకు శ్రమించారు. కానీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో అడ్మిట్​ అయిన కొన్ని గంటల్లోనే చికిత్స పొందుతూ కృష్ణ తుదిశ్వాస విడిచారు.వరుస మరణాలు.. కాగా, ఘట్టమనేని కుటుంబంలో ఈ ఏడాది వరుసగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆ ఫ్యామిలీలో సూపర్​ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్​ బాబు ఈ ఏడాది జనవరిలో గుండెపోటుతో, నెలన్నర క్రితం ఆయన భార్య ఇందిరా దేవి వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా తీవ్ర అస్వస్థతకు గురై వయసు రీత్యా సమస్యలతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×