E-Paper
Advertisement

Mahesh Babu : మనుష్యులందు నీ కథ.. మహర్షి లాగా సాగదా..

Mahesh Babu : మనుష్యులందు నీ కథ.. మహర్షి లాగా సాగదా..
Advertisement
Mahesh Babu

Mahesh Babu : మహేష్ బాబు.. సినిమా యాక్టర్ కంటే కూడా సంఘసేవకుడిగా ఎందరో జీవితాలలో వెలుగు నింపారు. మొదటినుంచి సమాజ సేవ చేయాలి అని ఆరాటంతో పాటు సేవా దృక్పథం కలిగిన మహేష్ ఎందరో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ కోసం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ఎంబీ పౌండేష‌న్ సంస్థ ద్వారా ఎందరో నిర్భాగ్యులకు అండగా నిలుస్తున్నారు.

ఇప్పటికీ ఈ సంస్థ అందిస్తున్న పలు రకాల సేవలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా తమ స్వగ్రామమైన బుర్రిపాలెం ను దత్తత తీసుకొని ఆ గ్రామానికి ఎన్నో రకాల వసతులను కల్పించారు మహేష్ బాబు. ఈ ఫౌండేషన్ భాద్యతలు మహేష్ బాబు తో పాటు అతని భార్య నమ్రత శిరోద్కర్ కూడా నిర్వహిస్తుంటారు. ఫౌండేషన్ కు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఆమె దగ్గర ఉండి చూసుకుంటారు.

Advertisement

రీసెంట్‌గా వీళ్ళ కుమార్తె సితార..తన మొదటి జువెలరీ యాడ్ కు గాను అందుకున్న పారితోషకాన్ని కూడా విరాళంగా కేటాయించి.. తండ్రికి తగ్గ కూతురు అని ప్రూవ్ చేసుకుంది. చనిపోయిన ఆమె నాయనమ్మ జ్ఞాపకార్థం ముసలి అవ్వలకు ఈ చిన్నారి తన చేతనైన సహాయాన్ని అందించింది. నిన్న సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతిని పురస్కరించుకొని మహేష్ బాబు తీసుకున్న మరో నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తండ్రి పేరు పదిమందికి గుర్తు ఉండడమే కాదు .. పది ఇళ్లల్లో దీపం వెలిగించే విధంగా ఉండాలి అని భావించిన మహేష్ బాబు కృష్ణ జ్ఞాపకార్థం ఒక ఎడ్యుకేషనల్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఫండ్ ఆధ్వర్యంలో 40 మంది అర్హులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడం కోసం అయ్యే ఖర్చు మహేష్ బాబు ఫౌండేషన్ చూసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలను మహేష్ బాబు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తూ అభిమానులు మహేష్ బాబును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

.

.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×