IND vs NZ : ఆ క్యాచ్ వదిలేసినందుకు బాధేసింది: షమీ

IND vs NZ : ఆ క్యాచ్ వదిలేసినందుకు బాధేసింది: షమీ

IND vs NZ
Share this post with your friends

 IND vs NZ

IND vs NZ : టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఫైనల్ చేరడంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పాత్రను తక్కువగా చేసి చూడటానికే లేదు.  కానీ అంత గొప్పగా ఆడినా ఒక వెలితి తనని పట్టి పీడించింది. అంత ముఖ్యమైన మ్యాచ్ లో షమీ చేతుల్లోంచి ఒక క్యాచ్ జారిపోయింది.  అయితే ఆ క్యాచ్ వేగాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడని అంటున్నారు. ఎందుకంటే విలియమ్సన్ ఆ బాల్ ని చాలా బలంగా దాంతో అది చేతుల్లో పడగానే చేప పిల్లలా రివర్స్ లో ఎగిరి పడింది.  

ఏం జరిగినా షమీ కూడా తప్పు ఒప్పుకున్నాడు. నిజంగా ఆ క్షణం చాలా బాధేసిందని అన్నాడు. మళ్లీ తనకి బౌలింగ్ వచ్చినప్పుడు బదులు తీర్చాలని అనుకున్నానని తెలిపాడు. అలా బౌలింగ్ చేతికి రాగానే విలియమ్సన్ క్యాచ్ తీసి, హమ్మయ్యా అనుకున్నానని తెలిపాడు. ఈ టోర్నమెంట్ కి ముందు ఎక్కువగా వన్డేలు ఆడలేదు. కాకపోతే అందరిలా యార్కర్లు, స్లో బంతుల కోసం కాకుండా కొత్త బంతితో ఎలా వికెట్లు తీయాలని ప్రాక్టీసు చేశానని తెలిపాడు. కరెక్టుగా లైన్ అండ్ లెంగ్త్ పట్టుకోడానికి ట్రై చేస్తున్నా, అది దొరికితే బౌలర్ల పని సులువు అవుతుందని అన్నాడు.

కానీ ఒకే ఓవర్ లో ఆరు బాల్స్ అదే వేగంతో, అదే స్వింగ్ తో, అదే చోట, అంతే బౌన్స్ తో వేయడం చాలా కష్టమని అన్నాడు. కానీ అది సాధ్యమవుతోంది. ప్రారంభంలో వికెట్లు తీస్తే ప్రత్యర్థులపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వారు తప్పులు చేస్తారు.

అలా వికెట్లు రాకపోతే వారు తాపీగా ఆడుకుంటూ వెళతారు. అందుకే  సెమీస్ పోరులో విలియమ్సన్, మిచెల్ ను ఆపాలంటే అద్భుతాలు అవసరం లేదు, క్రికెట్ లో ప్రాథమిక సూత్రాలతో బాల్స్ వేస్తే చాలని అనుకున్నాను. అలాగే వేసి వికెట్లు రాబట్టానని చెప్పాడు. పిచ్ కూడా బాగుంది. తేమ ఎక్కువవుతుందని కంగారుపడ్డాం.  ఆ పరిస్థితి రాలేదని అన్నాడు.

2015, 2019 సెమీఫైనల్స్ లో ఓటమి చూశాం. ఇప్పుడెట్టి పరిస్థితుల్లో కొట్టాల్సిందేనని అనుకున్నాం. లేదంటే ఇన్ని వరుసపెట్టి గెలిచిన మ్యాచ్ లకి అర్థమే లేదని కెప్టెన్ రోహిత్ అన్నాడని చెప్పాడు. అందరం కలిసికట్టుగా ఆడి విజయం సాధించామని అన్నాడు. మరొకసారి ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడే తాడోపేడో తేల్చేద్దామని డిసైడ్ అయ్యామని అంటున్నాడు. మరి ఫైనల్ పోరు ఎలా సాగుతుందో చూడాల్సిందే మరి…


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Fans Angry on Bumrah : బుమ్రాపై ఫ్యాన్స్ ఆగ్రహం

BigTv Desk

T20 Worldcup : ఫైనల్ కు రూల్స్ సవరణ.. ఎందుకంటే?

BigTv Desk

Shouryajith Sets Record : క్రీడారంగంలో చరిత్ర సృష్టించిన బాలుడు శౌర్యజిత్..

BigTv Desk

World Cup Team List: వన్డే ప్రపంచ కప్ కు భారత్ జట్టు ఇదే.. ఎవరెవరికి ఛాన్స్ దక్కిందంటే..?

Bigtv Digital

Top 3 Matches :- స్కోర్ తక్కువైనా గెలవడం బెంగళూరు అలవాటే…

Bigtv Digital

BCCI : ఆటగాళ్లకు BCCI డెడ్‌లైన్‌.. స్టోక్స్‌పై కన్నేసిన సన్‌రైజర్స్‌..

BigTv Desk

Leave a Comment