Tollywood Hero:గత కొన్ని నెలలుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి.. ‘ఛావా’ రూపంలో భారీ విజయం లభించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్(Vicky kaushal) , రష్మిక మందన్న (Rashmika mandanna) ప్రధాన పాత్రల్లో.. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఈ సినిమా అందించిన కలెక్షన్స్ తో పెద్ద రిలీఫ్ పొందిందని చెప్పవచ్చు. మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది అంటే.. ఇక ఈ సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది. అటు విక్కీ కౌశల్ కు, ఇటు రష్మిక మందన్న కు భారీ విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ప్రముఖ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో హిస్టారికల్ మూవీగా వచ్చిన ఈ సినిమాను ఒక టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నారని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరో ?ఇప్పుడు చూద్దాం.
ఛావా సూపర్ హిట్ మూవీని వదులుకున్న తెలుగు స్టార్ హీరో..
మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ లో విక్కీ కౌశల్, ఆయన భార్య యేసు భాయి క్యారెక్టర్ లో రష్మిక మందన్న చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా విక్కీ కౌశల్ మహారాజు పాత్రలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా చూస్తూ ఇందులో కొన్ని సన్నివేశాలను చూసి చాలామంది కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీకి ఆడియన్స్ ఎంతలా కనెక్ట్ అవుతున్నారో అర్థమవుతుంది. ఇటువంటి ఒక గొప్ప కథను సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మిస్ చేసుకున్నారట.
రిజెక్ట్ చేసిన మహేష్ బాబు..
డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman utkar) మొదట ఈ సినిమా కథను మహేష్ బాబుకు వినిపించగా
.. మహేష్ బాబు మాత్రం ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదట. అందుకే చాలాకాలం వరకు ఈ కథను తన దగ్గరే పెట్టుకున్న డైరెక్టర్.. ఒకరోజు విక్కీ కౌశల్ కి కథ చెప్పడంతో.. బాగుందని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆలా సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సిన ఈ సినిమా కథ బాలీవుడ్ హీరో చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. వాస్తవానికి మహేష్ బాబు.. రాజమౌళి(Rajamouli ) డైరెక్షన్లో సినిమాకి ఒప్పుకున్నారు ఈ సినిమాతో ఆయన గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ఉటేకర్ కథను రిజెక్ట్ చేసి ఉంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక గొప్ప కథను మహేష్ బాబు మిస్ చేసుకోవడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. మీరు ఈ ఒక్క సినిమా చేసి రాజమౌళి సినిమా చేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ బాబు ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని మిస్ చేసుకోవడం నిజంగా బాధాకరమని అటు ఆడియన్స్ కూడా చెబుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమాతో అటు విక్కీ కౌశల్ ఇటు రష్మిక మందన్న భారీ క్రేజ్ దక్కించుకుంటున్నారని చెప్పవచ్చు.