APAAR ID Card: ప్రస్తుతం మన దేశంలో పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా చాలా పనులకు ఉపయోగిస్తాం. ప్రస్తుత రోజుల్లో ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. దేనికి అప్లై చేసినా ఆధార్ కార్డు తప్పనిసరి అన్నట్లు అయిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు తరహాలో ఆపార్ కార్డు పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. దేశంలో పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉన్నట్లే.. ఒక దేశం, ఒక స్టూడెంట్ కార్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం అపార్ కార్డును తీసుకొచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR) తీసుకువచ్చింది.
దేశ వ్యాప్తంగా స్టూడెంట్స్ అందరికీ అపార్ కార్డ్ అందజేసే యోచనలో ఉంది. స్టూడెంట్స్ అందరూ తప్పకుండా ఈ కార్డులు తీసుకోవాలని చెబుతోంది. ఉన్నత విద్య చదువుతోన్న విద్యార్థులందరికీ ఈ ‘అపార్ ఐడీ కార్డులను అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ పలు చర్యలు చేపట్టింది. దీనికి గాను, వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ ప్రక్రియ ముగించాలని కళాశాలలకు, విశ్వావిద్యాలయాలకు ఇప్పటికే కేంద్రం పలు ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే ఎనఫ్..
ఈ అపార్ కార్డు సేమ్ ఆధార్ కార్డు లాగానే 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ కలిగి ఉంటుంది. వన్ నేషన్- వన్ స్టూడెంట్ పేరుతో ప్రతి స్టూడెంట్ కు ఈ కార్డును అందజేయనున్నారు. ఇప్పటికే ప్రతి కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేయనున్నారు. అపార్ కార్డును క్రియేట్ చేయడంలో అంబేద్కర్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూనివర్సిటీ 75 శాతం అపార్ కార్డులను ఇప్పటికే పూర్తి చేసింది. సాంకేతిక పరమైన సమస్యలు వచ్చినప్పుడు విద్యా నిపుణులు వెంటనే అవసరమైన సాయాన్నిచేస్తూ అపార్ ఐడీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కేంద్ర విద్యా శాఖ డిప్యూటీ సెక్రటరీ రోహిత్ త్రిపాటి… అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అభినందించారు. 100 శాతం అపార్ ఐడీలు అతి త్వరలోనే పూర్తిచేసి రికార్డ్ క్రియేట్ చేయాలని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: Passengers Alert: ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైల్వే స్టేషన్ ఎంట్రీపై కఠిన ఆంక్షలు, ఇకపై అది పక్కా!
అపార్ కార్డుల ద్వారా విద్యార్థులకు చాలా పనుల సులభంగా పూర్తి చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అకడమిక్ డేటా, రివార్డులు, డిగ్రీలు, స్కాలర్ షిప్, సర్టిఫికెట్స్ వివరాలను అన్నింటిని ఆన్ లైన్ లో ఒకే చోట నమోదు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో స్టూడెంట్స్ కు అపార్ కార్డులను జారీ చేస్తున్నారు. ఒక స్కూల్ నుంచి మరో స్కూల్ కు మారే సమయంలో అపార్ కార్డు ఉపయోగపడుతోంది. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి స్టూడెంట్ కు స్కూల్స్, కాలేజీలు అపార్ కార్డును అందజేయనున్నాయి. ఈ అపార్ ఐడీ కార్డును ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించగా.. త్వరలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు.