BigTV English

Kanguva: కంగువలోకార్తీ కూడా.. ట్విస్ట్ అదిరిపోయింది కదూ..

Kanguva: కంగువలోకార్తీ కూడా.. ట్విస్ట్ అదిరిపోయింది కదూ..

Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ నటిస్తోంది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


పాన్ ఇండియా లెవెల్లో కంగువ అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది. మొదటి నుంచి అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా డైరెక్టర్ శివ కూడా సినిమాను ఓ రేంజ్ లో చెక్కుతున్నాడు. ఫైర్ సాంగ్ లో సూర్య లుక్ చూసి అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా.. ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. కంగువలో కార్తీ కూడా కనిపించనున్నాడట. సూర్య, కార్తీ అన్నదమ్ములు అన్న విషయం తెల్సిందే. ఇద్దరూ స్టార్ హీరోస్ అయినా.. ఎప్పుడు స్క్రీన్ ను షేర్ చేసుకోలేదు. గతంలో కార్తీ నటించిన చినబాబు సినిమాలో సూర్య గెస్ట్ గా కనిపించాడు కానీ, అన్నదమ్ములు ఇద్దరు ఒక ఫ్రేమ్ లో కనిపించలేదు.


ఇక మొట్ట మొదటిసారి ఈ బ్రదర్స్ ఇద్దరూ కంగువలో కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని కంగువ ఫైర్ సాంగ్ గీత రచయిత వివేక్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కార్తీ కనిపించే కొద్దిసేపు కూడా థియేటర్ లో పూనకాలు ఖాయమని చెప్పుకొస్తున్నారు. ఇందులో అన్నదమ్ముల మధ్య సీన్స్ ఉంటాయంట. ఈ వార్త విన్నాకా కంగువపై హైప్ ఆకాశాన్నీ తాకింది. మరి ఈ బ్రదర్స్ ఈసారి ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×