Jyothika:ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ. తల్లిదండ్రులు, కొడుకులు.. కోడళ్ళు.. పిల్లలతో కళకళలాడే ఇళ్లు ఇప్పుడు లేవు. పెళ్లి కాగానే కోడళ్ళు.. భర్తలతో వేరు కాపురాలు పెట్టించేస్తున్నారు. అయితే ఇది సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా ఒక హీరో ఫ్యామిలీ ఎన్నో ఏళ్లు ఉమ్మడి కుటుంబంగానే ఉంది. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కానీ.. ఆ కుటుంబం కూడా ముక్కలు అయ్యింది. ఆ హీరో ఎవరో కాదు సూర్య.
సూర్య తండ్రి శివకుమార్ కూడా నటుడే. ఆయనకు ఇద్దరు మగపిల్లలు.. ఒక ఆడపిల్ల. పెద్ద కొడుకు సూర్య.. రెండో కొడుకు కార్తీ. ఇద్దరు హీరోలుగా సెటిల్ అయ్యారు. పెద్ద కొడుకు సూర్య.. హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లాడాడు. జ్యోతిక వచ్చాకా.. ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబంగా మారింది. కార్తీకి పెళ్లి అయినా.. కూడా అందరు కలిసే ఉండేవారు. అత్తమామలు, తోడికోడలు, మరిది, పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది.
అయితే ఏమైందో సడెన్ గా సూర్య- జ్యోతిక.. ముంబైకి షిఫ్ట్ అయ్యారు. తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు గుప్పుమన్నాయి. వదిననే తమని ఒక తాటిపై నిలబెట్టింది అని, ఎలాంటి గొడవలు వచ్చినా.. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆమె ఆపేది అని కార్తీ చెప్పుకొచ్చాడు. అలాంటి జ్యోతిక.. అత్తమామలతో పడలేక ముంబైకి షిఫ్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి. పెళ్లి తరువాత జ్యోతిక నటించకూడదని మామ ఆర్డర్ వేశాడని, ఆ తరువాత దాని గురించే గొడవలు అయ్యి సూర్య.. కుటుంబంతో సహా బయటకు వచ్చాడని కూడా ఒక పుకారు చెలరేగింది.
Manchu Manoj: మంచు వివాదం.. సడెన్ గా ఎన్టీఆర్ వీడియో పోస్ట్ చేసిన మనోజ్.. అసలేమైంది.. ?
ఇక ఇంకోపక్క సూర్య మాత్రం.. పిల్లల చదువు కోసం ముంబైకు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా జ్యోతికకు ముంబైలో చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉందని, తన కోసం, తన కుటుంబం కోసం అవన్నీ వదులుకొని ఇక్కడే ఉండిపోయిందని, అందుకే తన పాత జీవితాన్ని తనకు గిఫ్ట్ గా ఇవ్వడానికే అక్కడకు షిఫ్ట్ అయ్యినట్లు తెలిపారు. జ్యోతిక ముంబైకి వెళ్ళాకా.. బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటుంది.
జ్యోతిక ఎప్పుడైతే ముంబై వెళ్లిందో.. ఇప్పటివరకు చెన్నై వచ్చింది లేదు. సూర్య మాత్రం చెన్నై టూ ముంబై ప్రయాణం సాగిస్తున్నాడు. అసలు జ్యోతిక తిరిగి చెన్నై వచ్చే అవకాశం లేదని, చివరికి బంధువుల ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఆమె రావడం లేదని.. ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. దీంతో నిజంగానే జ్యోతికకు.. అత్తమామలతో పొసగడం లేదని టాక్ నడిచింది.
ఇక చాలా రోజుల తరువాత జ్యోతిక చెన్నైకి వచ్చింది. అత్తమామలతో కలిసి కనిపించి.. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. సూర్య అగారం అనే ఫౌండేషన్ నడుపుతున్న విషయం తెల్సిందే. పేద పిల్లలకు చదువు చెప్పించే ఈ ఫౌండేషన్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో సూర్య కుటుంబం మొత్తం పాల్గొంది. సూర్య – జ్యోతిక, వారి పిల్లలు.. కార్తీ కుటుంబం, శివ కుమార్ కుటుంబం మొత్తం ఇందులో పాల్గొంది. చాలా రోజుల తరువాత సూర్య కుటుంబం ఇలా కనిపించేసరికి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. వీరి మధ్య విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చినట్టే అని చెప్పుకొస్తున్నారు.